ETV Bharat / city

కృత్రిమ మేధ ఆధారిత ఏడాదిగా 2020: మంత్రి కేటీఆర్​ - telangana varthalu

కృత్రిమ మేధలో రాష్ట్రాన్ని ముందువరుసలో నిలిపేందుకు 2020లో 'ఇయర్ ఆఫ్ ఏఐ' చర్య ఎంతగానో దోహదపడిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. ప్రగతిభవన్​లో ఐటీశాఖ అధికారులతో ఏఐ ప్రగతి నివేదికను మంత్రి విడుదల చేశారు. కొవిడ్ మహమ్మారి సమయంలో సవాళ్లు అధిగమించడంలో ఏఐ సాంకేతికతకు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్​గా మార్చేందుకు ఈ చర్య ఎంతగానో దోహదపడిందని మంత్రి కేటీఆర్​ అన్నారు.

కృత్రిమ మేధ ఆధారిత ఏడాదిగా 2020: మంత్రి కేటీఆర్​

author img

By

Published : Jan 3, 2021, 4:31 AM IST

రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రవేశం లేని రంగం ఉండబోదంటే అతిశయోక్తి కాదు. పని విధానాన్ని, పని వాతావరణాన్ని పూర్తి స్థాయిలో మార్చగలిగే సామర్థ్యం ఉన్న కృత్రిమ మేధ ప్రాముఖ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందే గుర్తించింది. ఈ రంగంలో అందివచ్చే అవకాశాలు అందిపుచ్చుకుంటే అంతర్జాతీయంగా పెట్టుబడులు, ప్రత్యేక గుర్తింపు పొందేందుకు 2020ని కృత్రిమ మేధ ఆధారిత ఏడాదిగా ప్రకటించింది. ఇది ప్రకటించి ఏడాది పూర్తైన సందర్భంగా రాష్ట్రం సాధించిన ప్రగతిపై నివేదికను ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ విడుదల చేశారు. 2020ను కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించి 120కి పైగా ఈవెంట్లు, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, ఐఐటీ-హైదరాబాద్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం, అమెజాన్ వంటి సంస్థలతో కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు సర్కార్‌ తెలిపింది.

అనేక సవాళ్లకు మార్గాలు

కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వ పాలనలో అనేక సవాళ్లకు కృత్రిమ మేధ మార్గాలు చూపిందని కేటీఆర్ అన్నారు. జూన్ -2020లో కృత్రిమ మేధా విభాగంలో విధివిధానాలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తద్వారా పరిశ్రమలు, స్టార్టప్, అవసరమైన భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకొని ఏఐ నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేసింది. ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లేందుకు నాస్కాం భాగస్వామ్యంతో తెలంగాణ ఏఐ మిషన్​ను ప్రారంభించింది. ఆపై ఇంటెల్, ట్రిపుల్ ఐటీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో అప్లయిడ్ ఏఐ పరిశోధనా కేంద్రాన్ని అక్టోబర్ 12న ప్రభుత్వం ప్రారంభించింది. కొవిడ్‌ సంక్షోభ సమయంలో... కృత్రిమ మేధ విజయంపై చాలా అనుమానాలుండేవని... కానీ ప్రభుత్వ విజన్ వాటన్నింటికీ సమాధానాలిచ్చిందని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ స్పష్టం చేశారు.

వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధా

రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ రంగంలోకి కృత్రిమ మేధను అందుబాటులోకి తెచ్చింది. ఎరువుల నిర్వహణ, డ్రోన్‌, రిమోట్ సెన్సింగ్, ఐఓటీ సెన్సర్స్ సాంకేతికతను వ్యవసాయ పద్ధతుల్లో భాగం చేస్తున్నారు. కొవిడ్‌ సమయంలో ఫేస్‌ మాస్క్ ఉల్లంఘనలు గుర్తించటానికి, ఫేస్, ఉష్ణోగ్రతలను భౌతికదూరంతో గుర్తించేందుకు సాంకేతికతను వాడుతున్నారు. మాతాశిశు సంక్షేమ ఆధ్వర్యంలో పిల్లల బరువు, పోషణకు సంబంధించిన విశ్లేషణ కొరకు ఏఐ ఆధారిత ఆంథ్రోమెట్రీ టెక్నాలజీని అంగన్‌వాడీ, ఆశావర్కర్లకు అందజేశారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ నిపుణులను పెంచేలా.. 2021 లోగా 30 వేల యువతను నైపుణ్యాలు అందించనున్నారు. టాస్క్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నతవిద్యామండలి, నాస్కాం, మైక్రోసాఫ్ట్ కలిసి ఈ శిక్షణనిచ్చేందుకు ముందుకొచ్చాయి.

ఏఐపై ప్రాధాన్యం తగ్గదు

2020 ఏడాది ముగిసినా... కృత్రిమమేధపై ప్రభుత్వ ప్రాధాన్యం తగ్గదు.'అందరిని భాగస్వామ్యులు చేసేందుకే ఇయర్‌ ఆఫ్‌ ఏఐ' ప్రారంభించాం. ఏడాది(2020) ముగిసినంత మాత్రానా ఏఐపై దృష్టిపెట్టకుండా ఏం చేయరని కాదు. ఇందుకు సంబంధించి గట్టి పునాది పడింది. దీనిని 2021తో పాటు వచ్చే కాలంలోనూ కార్యక్రమాలు కొనసాగుతాయి. -జయేశ్‌ రంజన్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి

సాంకేతితను రాష్ట్ర సర్కారు మరిన్ని రంగాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఇదీ చూడండి: సాంకేతికాభివృద్ధిలో కృత్రిమ మేధ పాత్ర ఎంతో కీలకం: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.