ETV Bharat / city

గాంధీలో మరో 200 ఆక్సిజన్‌ పడకలు - gandhi hospital

రెండో దశలో కరోనా విజృంభిస్తోన్న వేళ... గాంధీ ఆసుపత్రిలో అందుకు తగ్గ సౌకర్యాలు ఏర్పాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 300 ఐసీయూ పడకలను ఏర్పాటు చేయగా... ఇంకో 200 ఆక్సీజన్​ పడకలు సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

200 more oxygen beds in gandhi hospital
200 more oxygen beds in gandhi hospital
author img

By

Published : Apr 8, 2021, 10:06 AM IST

హైదరాబాద్​ గాంధీ ఆసుపత్రిలో అదనంగా మరో 200 ఆక్సిజన్‌ పడకలను ఏర్పాటు చేసేందుకు పాలనా యంత్రాంగం నిర్ణయించింది. కరోనా రెండో దశ మొదలవగానే 200 ఐసీయూ పడకలను ప్రధాన భవనంలోని రెండో అంతస్తులో ఏర్పాటుచేశారు. కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుండడం వల్ల మరో వంద పడకలను మూడో అంతస్తులో సమకూర్చారు. ప్రస్తుతం కరోనా అత్యవసర బాధితులనే చేర్చుకుంటున్నారు. ఇకపై వచ్చేవారి కోసం ఆక్సిజన్‌, వెంటిలేటర్లు అమర్చే పడకల ఏర్పాటుకు ఉపక్రమించారు.

ఇప్పటివరకు ఉన్న 300 పడకలన్నీ వెంటిలేటర్ల సౌకర్యమున్నవే కావడం వల్ల... వాటిల్లోనే ఆక్సిజన్‌ అవసరమయ్యే రోగులనూ ఉంచి వైద్యాన్ని అందిస్తున్నారు. ఇటీవల పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్‌ను మాత్రమే అందించేలా తాజాగా 200 పడకలను సమకూర్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం అత్యవసర బాధితుల సంఖ్య 182కి చేరిందని సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు తెలిపారు. సుమారు 20 మంది బాధితులు బుధవారం మృత్యువాత పడ్డారు.

ఇదీ చూడండి: 'రెండో దశలో నేరుగా రక్తంలో చేరుతున్న వైరస్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.