హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో కొవిడ్ కేసుల సంఖ్య 2815కు చేరుకొంది. నియోజకవర్గంలోని రాంనగర్, అడిక్మెట్, బోలక్పూర్, ముషీరాబాద్, గాంధీ నగర్, కవాడిగూడ డివిజన్లకు చెందిన కరోనా అనుమానితులు.. ముషీరాబాద్, బోలక్పూర్, దోమలగూడలోని నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఫలితంగా ఆయా కేంద్రాలు కరోనా అనుమానితులతో కిక్కిరిస్తున్నాయి.
సోమవారం.. కొత్తగా 18 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 43 మంది డిశ్చార్జ్ అయ్యారు. బాకారానికి చెందిన ఒకరు కరోనాతో మృతిచెందారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు 60 మంది మృతిచెందగా.. 2,352 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 403 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు జీహెచ్ఎంసీ సర్కిల్ ఉప కమిషనర్ ఉమా ప్రకాష్ తెలిపారు
కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి జీహెచ్ఎంసీ, ఆరోగ్య శాఖ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడంలేదని.. పలువులు బాధితులు ఆరోపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్యలోపం ఉన్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: 'వచ్చే రెండు నెలల్లో వైరస్ ఉద్ధృతి కొంత తగ్గొచ్చు'