AP CORONA CASES: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. సంక్రాంతి వేడుకలు, ప్రయాణికుల రద్దీ, గుంపులుగా సంచరించడం వంటి కారణాలతో కొవిడ్ కేసులు పెరిగినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 47,420 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 12,615 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా మరో ఐదుగురు మృతి చెందారు. 3,674 మంది మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,338మంది వైరస్ బారిన పడ్డారు. విశాఖ జిల్లాలో 2,117, గుంటూరు జిల్లాలో 1,066, విజయనగరం జిల్లాలో 1,039, నెల్లూరు జిల్లాలో 1,012, అనంతపురం జిల్లాలో 951, కర్నూలు జిల్లాలో 884, ప్రకాశం జిల్లాలో 853, కడప జిల్లాలో 685, తూ.గో. జిల్లాలో 627 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కొవిడ్ నుంచి మరో 3,674 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 53,871 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఒక్కరోజే 3 లక్షలకుపైగా కేసులు
Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు.. 3,17,523 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 491 మంది మరణించారు. 2,23,990 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 93.69 శాతంగా నమోదైందని పేర్కొంది.
- మొత్తం కేసులు: 3,82,18,773
- మొత్తం మరణాలు: 4,87,693
- యాక్టివ్ కేసులు: 19,24,051
- మొత్తం కోలుకున్నవారు: 3,58,07,029
Omicron Cases In India
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 73,38,592 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,59,67,55,879కు చేరింది.
మార్చి నెలకల్లా..
మార్చి నెలకల్లా కరోనా మహమ్మారి ఎండమిక్‌గా మారనుందని ఐసీఎంఆర్‌కు చెందిన వైద్య నిపుణుడు సమీరన్ పాండా అంచనా వేశారు. 'మనం మన రక్షణ కవచాల(కొవిడ్ నిబంధనలను ఉద్దేశిస్తూ) విషయంలో అశ్రద్ధ వహించకుండా ఉంటే, కొత్త వేరియంట్లు పుట్టుకురాకపోతే.. మార్చి 11 కల్లా కరోనా వైరస్ ఎండమిక్‌గా మారనుంది. డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్‌ను భర్తీ చేస్తే.. కొవిడ్ ఎండమిక్‌గా మారుతుంది. కొత్త వేరియంట్ పుట్టుకురాకపోతే ఆ అవకాశం ఉంటుంది' అని పాండా అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 34,56,592 మందికి కరోనా సోకింది. 8,814 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 33,91,90,402కి చేరగా.. మరణాలు 55,83,277కు పెరిగింది.
ఇదీ చదవండి: Covid Guidelines: రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలు పొడిగింపు