రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,94,587కు చేరింది. మహమ్మారితో మరో ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు 1,601 మంది మృతిచెందారు. కరోనా నుంచి తాజాగా 264 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనా నుంచి 2,90,894 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 2,092 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 723 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 26 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: మోగిన బడి గంట... విద్యార్థుల రాకతో నెలకొన్న సందడి