ETV Bharat / city

అలుపెరగని సేవకులు.. ‘104’, ‘108’ ప్రత్యేక బృందాలు - అలుపెరగని సేవకులు.. ‘104’, ‘108’ ప్రత్యేక బృందాలు

కరోనా రక్కసి కోరలు చాస్తున్న సమయంలో 104 కౌన్సెలింగ్‌ బృందాలు, 108 అంబులెన్సు అత్యవసర బృందాలు విశేష కృషి చేస్తున్నాయి. బాధితులకు అవగాహన కల్పించేందుకు, ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు అనునిత్యం అప్రమత్తంగా ఉంటున్నాయి.

corona virus
అలుపెరగని సేవకులు..
author img

By

Published : Apr 9, 2020, 11:06 AM IST

ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న దగ్గు వచ్చినా ఎక్కడా లేని భయం. ఈ నేపథ్యంలో 104 కౌన్సెలింగ్‌ బృందాలు అండగా ఉంటున్నాయి. రోజులో 24 గంటలు అందుబాటులో ఉండే ఈ వ్యవస్థ వల్ల ఎంతోమంది ఉపశమనం పొందుతున్నారు. నిత్యం 400-500 వరకు ఈ విభాగానికి కాల్స్‌ వస్తున్నాయి.

ఏం చెప్పాలి.. ఏమని అడగాలి... 104కు ఫోన్‌ చేశాక మీ వయసు, నివాసం, ఇటీవలి పర్యాటక చరిత్ర అన్నీ వివరించాలి. తర్వాత మీ అనారోగ్య సమస్యపై దాచకుండా వివరించాలి. అప్పుడే మీ ఆరోగ్యంపై ఓ అంచనాకు వచ్చి సాధారణ జలుబా? లేదా కరోనా లక్షణాలున్నాయా? అనేది కౌన్సెలింగ్‌ నిపుణులు చెబుతారు. ఆసుపత్రికి తరలించాలా..? లేదంటే ఇంటి వద్దే క్వారంటైన్‌లో ఉంచాలా? అనేది సూచిస్తారు.

అనంతరం రంగంలోకి 108..

గ్రేటర్‌ వ్యాప్తంగా 32.. 108 అంబులెన్సులు కరోనా బాధితుల సేవలో నిమగ్నమయ్యాయి. గతనెల 13 నుంచి ఇప్పటివరకు 4150 కరోనా అనుమానితులను ఆసుపత్రులకు తరలించాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ పరిధిలో 1100 మంది వీటి సేవలు వినియోగించుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందించేలా 12 వాహనాల్లో వెంటిలేటర్లు, ఐసీయూ యూనిట్‌ అందుబాటులో పెట్టారు.

నేరుగా ఫోన్‌ వద్దు.. నగరంలో ఎక్కడ కరోనా అనుమానితులున్నా 104 కేంద్రం సమాచారం మేరకు 108 అంబులెన్సు వాహనాల ద్వారా గాంధీ, కింగ్‌కోఠి, ఛాతీ, గచ్చిబౌలిలోని క్వారంటైన్‌ కేంద్రాలకు పంపిస్తుంటారు. చికిత్స పొందిన వారిని వారి స్వస్థలాలకు ‘108’ వాహనాలే చేర్చుతున్నాయి. కరోనా లక్షణాలుంటే నేరుగా 108ను సంప్రదించే వీలు లేదు. కేవలం ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారే ‘108’కు ఫోన్‌ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: గుంజిళ్లు తీయించి.. కరోనా ప్రమాణం చేయించి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.