ETV Bharat / city

సంజీవనికి ఏమైంది.. సమయానికి ఎందుకు రాలేకపోతోంది? - హైదరాబాద్ కరోనా వార్తలు

అత్యవసరంలో ప్రజల ప్రాణాలు కాపాడే 108 వాహనాలు సకాలంలో చేరుకోవడం లేదు. గ్రేటర్‌ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామంది ఆసుపత్రులకు చేరేందుకు 108 వాహనాల కోసం ఫోన్లు చేస్తున్నా.. పట్టించుకోవడం లేదు. అదిగో..ఇదిగో...అనడం తప్పా.. ఎంతసేపటికి వాహనాలు చేరుకోవడం లేదని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. చివరికి చేసేది లేక ఆటోలు ఇతర ప్రైవేటు వాహనాలు బుక్‌ చేసుకొని బతుకు జీవుడా...అంటూ ఆసుపత్రులకు చేరుతున్నారు.

108 ambulance
108 ambulance
author img

By

Published : Jul 20, 2020, 9:04 AM IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిత్యం వేయి మంది వరకు కరోనా బారిన పడుతున్నారు. తీవ్ర లక్షణాలు ఉన్నవారు ఆసుపత్రులకు వెళ్లేందుకు 108 వాహనాలకు ఫోన్‌ చేస్తున్నారు. గంటల తరబడి నిరీక్షించినా సరే...వాహనాలు మాత్రం రావడం లేదని అంటున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ పరిధిలో 108 వాహనాలు 52 వరకు తిరుగుతున్నాయి. వీటిని కొవిడ్‌ సేవల కోసం వినియోగిస్తున్నారు. దాదాపు 300 మంది క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నారు. పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాహనాలు ఏ మూలకు సరిపోవడం లేదు.

20 నిమిషాల్లో వచ్చేది

సాధారణ రోజుల్లో 108కు ఫోన్‌ చేసిన 15-20 నిమిషాల్లోనే వాహనం వచ్చేది. ప్రస్తుతం గంటలు గడిచినా...జాడ ఉండటం లేదు. ప్రధాన నగరంలో ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఒక్కో వాహనం ఉందని అధికారులు చెబుతున్నారు.

అదే శివార్లలో ప్రతి 25-30 కిలోమీటర్లకు ఒక 108 వాహనం సేవలు అందిస్తోందని అంటున్నారు. కరోనా కాకుండా ప్రమాదంలో గాయపడితే తక్షణం సేవలు అందించాలి. ప్రస్తుత సమయాల్లో ప్రమాదాలు జరిగినా...వాహనాలు వచ్చేసరికి తీవ్ర జాప్యం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు.

ఇవీ ప్రధాన కారణాలు...

  • ప్రస్తుతం గ్రేటర్‌ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చి మరో రోగి వద్దకు 108 వాహనం వెళ్లే సరికి అరగంట నుంచి గంట సమయం పడుతుంది. ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే అక్కడ చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఇలా నాలుగైదు ఆసుపత్రులు తిరిగే సరికే మరో గంట, రెండు గంటల సమయం పడుతోంది. దీనివల్ల ఇంకో రోగి వద్దకు చేరుకునేందుకు ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు.
  • ఆసుపత్రుల నుంచి రోగులను వాళ్ల ఇళ్లకు పంపే సమయంలో కూడా కొంత జాప్యం జరుగుతోంది. ఆసుపత్రిలో క్లియరెన్స్‌లు తీసుకొని వారిని వాహనం ఎక్కించి చేర్చటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
  • నగరంలో చిన్న వర్షం పడినా, ట్రాఫిక్‌ స్తంభించినా 108 వాహనం చేరుకోవడానికి 2-3 గంటల సమయం పడుతోంది.
  • ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులు, జనాభాను పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్‌, మేడ్చల్‌, మెదక్‌, రంగారెడ్డి పరిధిలో మరో 70-80 కొత్త వాహనాల అవసరం ఉంది. ఇందుకు 2016లో కుటుంబ సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖకు ప్రతిపాదనలు పంపారు. వాటికి ఇప్పటివరకు మోక్షం లభించలేదు. ప్రతిపాదనలు బుట్టదాఖలు చేయడంతో ఉన్నవాటితోనే నెట్టుకొస్తున్నారు.
  • శివార్లలో ఉండే ప్రాంతీయ ఆసుపత్రుల నుంచి తరచూ రిఫరల్‌ కేసులను ఉస్మానియా, గాంధీలకు తరలించడానికే ఎక్కువ 108 వాహనాలను వినియోగిస్తున్నారు. దీంతో ఎక్కువ సమయం పడుతోంది.
  • 108 వాహనాలకే కాకుండా మరో 30 వరకు బైక్‌ అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి. వాహనాలు చేరేలోపు ఈ బైక్‌ అంబులెన్సుల సేవలను సమర్థంగా వినియోగించుకునేలా అధికారులు ప్రణాళికలు రూపొందించడం అవసరం.

ఇదీ చదవండి: నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.