ఏపీలో 24 గంటల వ్యవధిలో 10,601 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 73 మంది మృతి చెందారు. కరోనా బాధితుల సంఖ్య 5,17,094కు చేరింది. ఇప్పటివరకు 4,560 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 4,15,765 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 96,769 మంది చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో 70,993 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 42,37,070 పరీక్షలు చేపట్టారు.
జిల్లాల వారీగా మృతులు...
24 గంటల్లో గుంటూరు జిల్లాలో 10, అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లాల్లో 8, కడప, ప్రకాశం జిల్లాల్లో 7, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో 6, తూ.గో., కృష్ణా, ప.గో. జిల్లాల్లో ఐదుగురు చొప్పున.. శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లా, విజయనగరం జిల్లాలో ఒకరు కరోనాతో మృతి చెందారు.
జిల్లాల వారీగా కేసులు...
24 గంటల్లో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 1457 కరోనా కేసులు నమోదయ్యాయి. తూ.గో. జిల్లాలో 1426, చిత్తూరు జిల్లాలో 1178, ప.గో. జిల్లాలో 1122, నెల్లూరు జిల్లాలో 1042, కడప జిల్లాలో 801, గుంటూరు జిల్లాలో 702, విజయనగరం జిల్లాలో 598, కర్నూలు జిల్లాలో 514, శ్రీకాకుళం జిల్లాలో 505, విశాఖ జిల్లాలో 426, కృష్ణా జిల్లాలో 389 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి.