కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో గాంధీ ఆస్పత్రికి డీఆర్డీఓ 100 సిలిండర్లు అందజేశారు. గాంధీకి ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వాలని ఇటీవలే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ను కోరానని తెలపగా.. డీఆర్డీఓ అధికారి సతీశ్.. మిసైల్స్‌కు వాడే నైట్రోజన్ సిలిండర్లను ఆక్సిజన్ సిలిండర్లుగా కన్వర్ట్ చేసి గాంధీకి పంపినట్లు చెప్పారు.
ఆక్సిజన్‌తో పాటు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు తెలంగాణకు ఎక్కువగా కేటాయించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కోరినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, కరోనా చైన్‌ను బ్రేక్ చేయాల్సింది ప్రజలేనని అన్నారు.