'జీహెచ్ఎంసీ పరిధిలో దోమలపై డ్రోన్లతో సమరం' గ్రేటర్ పరధిలో దోమల బెడద పెరిగిపోతోంది. చెరువుల్లో గుర్రపుడెక్క పుణ్యమా అనిదోమలు విజృంభిస్తున్నాయి. వేసవికాలమైనా.. డెంగ్యూ, మలేరియాతో చెరువుల సమీపంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమల నివారణపై దృష్టి సారించిన గ్రేటర్ అధికారులు... సంప్రదాయబద్ధంగా వాడుతున్న పద్ధతుల స్థానంలో కొత్త టెక్నాలజీ ఉపయోగించారు. డ్రోన్లతో చెరువుల్లో రసాయనాలు చల్లడం ప్రారంభించారు.
గురునాథం చెరువుతో ప్రారంభం
హైదరాబాద్ మియాపూర్లోని గురునాథం చెరువులో మొట్టమొదటి సారిగా డ్రోన్ ద్వారా రసాయనాలను వెదజల్లే ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జోనల్ కమిషనర్ హరిచందన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ ప్రయోగం విజయవంతమైతే అన్ని చెరువుల్లో డ్రోన్ల ద్వారా రసాయనాలు పిచికారి చేస్తామని తెలిపారు.
ఇవీ చూడండి:ఇది ఆసుపత్రా.. లేక పశువుల సంతా..?