ETV Bharat / city

మనోళ్ల డేటాను దోచేశారు

ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు... తెలంగాణవాసుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా  సేకరించింది. ఈ సమాచారాన్ని ఎక్కడి నుంచి చోరీ చేసింది,  ఎవరికిచ్చిందనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రధాన నిందితుడు, ఆ సంస్థ యజమాని అశోక్​ దొరికితే అన్ని విషయాలు బట్టబయలవుతాయని సిట్​ అధికారులు తెలిపారు.

author img

By

Published : Mar 8, 2019, 5:20 AM IST

తెలంగాణ ప్రజల సమాచారం కూడా ఉంది
తెలంగాణ ప్రజల సమాచారం కూడా ఉంది
డేటా చౌర్యం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన కేసు విచారణకు... స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. తొలిసారిగా సమావేశమైన సిట్... ఇప్పటిదాకా ఏపీ సమాచారమే కాకుండా తెలంగాణ ప్రజలది కూడా ఉన్నట్లు తేల్చారు. డేటా ఎలా వచ్చింది అనే కోణంలో దృష్టి సారించారు. ఇప్పటికే బ్లూఫ్రాగ్ కంపెనీ భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు.

తెలుగుదేశం పార్టీ మొబైల్ అప్లికేషన్​ 'సేవామిత్ర'లో... ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారనే సున్నితమైన సమాచారం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వైకాపా నేత లోకేశ్వర్​ రెడ్డి ఫిర్యాదుతో ఐటీ గ్రిడ్స్ సంస్థను సీజ్ చేసి... హార్డ్ డిస్క్​లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

అమెజాన్ వెబ్ సర్వీసెస్​ వద్ద ఐటీ గ్రిడ్స్ భద్రపరుచుకున్న సమాచారాన్ని వీలైనంత తొందరగా ఇవ్వాలని పోలీసులు కోరారు. స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్​లను ఫోరెన్సిక్​లో పరీక్షిస్తున్నారు. ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ గత నెల 27న 'సేవామిత్ర'లో కొంత డేటాను తొలగించినట్లు తెలిపారు. ఆయనను ప్రశ్నిస్తే ఎందుకు చేశారనే దానితోపాటు... ఎక్కడి నుంచి సేకరించారనే విషయంపై స్పష్టత వస్తుందని సిట్​ ఇంఛార్జ్​ రవీంద్ర తెలిపారు. డేటా చౌర్యం వ్యవహారంలో ఎవరైనా నష్టపోతే నేరుగా సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.