గ్రేటర్ హైదరాబాద్, అసెంబ్లీ ఎన్నికల్లాగే భాజపాను ఓడగొడతామని సికింద్రాబాద్ సన్నాహక సభలో అన్నారు కేటీఆర్. సికింద్రాబాద్ గడ్డ మీద తెరాస జెండా ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఏం చేశారని ఓట్లడగడానికి వస్తున్నారంటూ కమల దళాన్ని నిలదీశారు. రాష్ట్రానికి కనీస ప్రాతినిధ్యం ఇవ్వలేదని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలు మోదీకి, రాహుల్కు మధ్యేనని కాంగ్రెస్ అనడం సిగ్గు చేటన్నారు.
ఏదీ ఏమైనా... 16 స్థానాలు గెలిచి తెంలగాణ అభివృద్ధి కోసం పేగులు తెగేదాకా కొట్లాడతామని హామీ ఇచ్చారు. ఎర్రకోటపై ఎవరు జెండా ఎగరవేయాలో నిర్ణయించేది తెలంగాణ గల్లీల్లోనే అని తేల్చిచెప్పారు.
ఇవీ చూడండి:అయితే భోఫోర్స్ లేకుంటే రఫేలా?