ఈ పర్యావరణహిత మూత్రశాల ద్వారా ఏటా ఒక్కదానిపై లక్షా యాభై వేల లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు. అంటే ఈ ఆదాతో సంవత్సరానికి 150 మందికి తాగునీటి కష్టాలు తీర్చొచ్చు అంటున్నారు భూపతి. హైడ్రోఫోబిక్ మెటీరియల్తో తయారు చేసిన ఈ టాయిలెట్లు నీటిని మూత్రంతో కలవనీయకుండా చేస్తుంది. నీరు కలిసినప్పుడు మాత్రమే దుర్వాసన వెలువడుతుందని ఆయన అంటున్నారు.
ఈ ఆధునాతన మూత్రశాలలను మెట్రో స్టేషన్‌ల వద్ద ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ మెట్రోతో భూపతి ఒప్పందం కుదుర్చుకున్నారు. మియాపూర్, నాగోల్ మెట్రో కారిడార్‌లో 37 మూత్రశాలలు ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం పురుషులకే పరిమితమైన ఈ మూత్రశాలలు త్వరలో స్త్రీలకూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.