ETV Bharat / city

సీఎం, సీఎస్​పై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్​ - marri shashidhar reddy

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన సీఎం కేసీఆర్​, సీఎస్​ ఎస్కే జోషిపై చర్యలు తీసుకోవాంటూ కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది. సచివాలయంలో హస్తం పార్టీ నేతలు మర్రి శశిధర్​ రెడ్డి, నిరంజన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​ కుమార్​కు ఫిర్యాదు చేశారు.

మర్రి శశిధర్​ రెడ్డి
author img

By

Published : Apr 7, 2019, 5:16 PM IST

ప్రగతిభవన్​ వేదికగా కేసీఆర్​ పలువురు నేతలను పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్​ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన సీఎం, సీఎస్​పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​ కుమార్​కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్ రాజకీయ సమావేశాలు నిర్వహించడం లేదని తెరాస లిఖితపూర్వకంగా స్పష్టం చేసినట్లు సీఈఓ గతంలో చెప్పారని మర్రి శశిధర్​ రెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ సీఎస్ జోషి ఐటీ నివేదిక విడుదల చేశారని... కేసీఆర్, కేటీఆర్​కు వచ్చిన అవార్డుల వివరాలు అందులో ఉన్నాయని ఎన్నికల సంఘం దృష్టి తీసుకెళ్లారు. నిబంధనలు ఉల్లంఘించిన సీఎస్​ను తప్పించాలని డిమాండ్ చేశారు. జయేష్ రంజన్, ఐటీ అధికారులతో కేటీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారని.. జయేష్ రంజన్​పై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీ చూడండి: 'ప్రధాని అయ్యందుకు కేసీఆర్​ అర్హుడే'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.