ETV Bharat / city

అర్ధరాత్రి పురుటి నొప్పులు.. అంబులెన్స్​లో ప్రసవం

author img

By

Published : Oct 3, 2020, 1:30 PM IST

నిర్మల్ జిల్లా మామడ మండలం కొరిటికల్ గ్రామానికి చెందిన ఓ గర్భిణి అంబులెన్స్​లో ప్రసవించింది. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో పురిటి నొప్పులు ఎక్కువవ్వగా..అంబులెన్సును ననాపూర్ వద్ద ఆపేశారు. 108 సిబ్బంది సాయంతో మగ శిశువుకు జన్మనిచ్చింది.

women  delivers a baby boy in ambulance at nirmal district
అర్ధరాత్రి పురుటి నొప్పులు.. అంబులెన్స్​లో ప్రసవం

అర్ధరాత్రి వేళ పురిటినొప్పులతో బాధపడుతున్న ఒక గర్భిణిని 108 అంబులెన్స్ సిబ్బంది ఆదుకున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం కొరిటికల్ గ్రామానికి చెందిన సింధు అనే మహిళకు నెలలు నిండడంతో శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతమైనందున రాత్రి వేళ వాహన సదుపాయానికి ఇబ్బంది ఏర్పడింది.

బాధతో విలవిలలాడుతున్న ఆమెను ప్రసూతి ఆసుపత్రికి తరలించడానికి 108 ఆంబులెన్స్​కి సమాచారం అందించారు. గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో నొప్పులు ఎక్కువవ్వగా..అంబులెన్సును ననాపూర్ వద్ద ఆపేశారు. అంబులెన్స్​ సిబ్బంది సాయంతో.. ఆమె పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. అనంతరం ఇరువురిని ప్రసూతి ఆసుపత్రిలో చేర్పించారు.

ఇవీ చూడండి: కరోనా సోకిన గర్భిణికి పురుడు పోసిన 108 సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.