అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ.. వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. హర్యానాకు చెందిన మూడు కార్లలో 160 కిలోల గంజాయిని స్మగ్లర్లు తరలిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విశాఖపట్టణం సీలేరు నుంచి హర్యానాకు తరలిస్తున్న గంజాయి తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అంబేద్కర్ కాలనీలో పట్టుకున్నారు.
ఆదిలాబాద్‌కు చెందిన షరీపుద్దీన్, హర్యానాకు చెందిన తారీఫ్ఖాన్లు పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో గంజాయి చేతులు మార్చే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి 160 కిలోల గంజాయి, రూ.2 లక్షల నగదు, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించనున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి: ఈ అపార్టుమెంట్లోకి కరోనా రాకుండా ఏం చేశారో తెలుసా?