ETV Bharat / city

బతికున్నోడిని చంపేశారు... చనిపోయినోడిని పట్టించుకోవట్లేదు...! - raithu beema in adilabad

ఆదిలాబాద్‌ జిల్లాలో ఓవైపు షాదిముబారక్‌, కళ్యాణలక్ష్మి అక్రమాలు ప్రకంపనలు సృష్టిస్తుంటే... మరోవైపు వ్యవసాయశాఖ పరిధిలోని రైతుబంధు, రైతు బీమాలో అవకతవకలు వెలుగుచూస్తున్నాయి. బతికున్న రైతును చనిపోయినట్లు నమోదు చేయడంతో ఒకరికి రైతుబంధు ఆగిపోతే.. చనిపోయినా మరో రైతుకు రైతుబీమా అందని వైనం బయటపడింది. బాధితులు గోస పెట్టుకున్నా అధికారులు స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

special investigation story on raithu bheema

author img

By

Published : Nov 21, 2020, 9:42 AM IST

బతికున్నోడిని చంపేస్తున్నారు... చనిపోయినోడిని పట్టించుకోవట్లేదు...!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా, రైతు బందు పథకాల అమలు... ఆదిలాబాద్‌ జిల్లాలో లెక్కతప్పుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో రైతు సంక్షేమం... గాడితప్పుతోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 99 వేల 909 మంది రైతులు రైతు బీమా చేయించుకోగా... ఇప్పటిదాకా 106 మంది రైతులు చనిపోయినట్లు వ్యవసాయశాఖ నివేదిక వెల్లడిస్తోంది. చనిపోయిన రైతుల్లో కేవలం 73 కుటుంబాలకే 5లక్షల రూపాయల చొప్పున బీమా పరిహారం అందింది. మిగిలిన దరఖాస్తులను ఎటూ తేల్చకపోవడంతో బాధిత రైతు కుటుంబాల్లో ఆవేదన గూడుకట్టుకుంటోంది.

చనిపోయిన ఏడాది గడుస్తున్నా...

ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం వాన్‌వట్‌ గ్రామానికి చెందిన మరప రవి ఏడాదిగా రైతుబీమా కోసం ఎదురుచూస్తున్నా అధికారులు కనికరించడం లేదు. ఎకరంన్నర పొలం కలిగిన రవి తండ్రి నాగోరావు 2019 నబంబర్‌ 17 అనారోగ్యంతో మరణించారు. అన్ని ధ్రువపత్రాలతో బీమా కోసం రవి దరఖాస్తు చేశాడు. ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

నువ్వు చనిపోయావు కదా...

వ్యవసాయాధికారుల నిర్లక్ష్యానికి మరో ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. సిరికొండ మండలం రాంపూర్‌ గ్రామానికి అంజనాబాయికి ఒక ఎకరం 31 గుంటల భూమి ఉంది. వానాకాలం పంటకు రైతుబంధు రాకపోవడం వల్ల.. ఏమైందని ఆరాతీసిన రైతుకు అధికారులు కంగు తినే సమాధానమిచ్చారు. "నువ్వు చనిపోయావు" అని చెప్పగా... బతికే ఉన్నానంటూ గోడు వెళ్లబోసుకుంటున్నా... అధికారులు స్పందించడంలేదు.

జిల్లాస్థాయిలో ఎప్పటికప్పుడు రైతు బంధు, రైతు బీమా పథకం అమలు తీరుపై ఉన్నతాధికారులు సమగ్ర సమీక్షలు నిర్వహించకపోవడంతోనే తప్పులు దొర్లుతున్నాయని విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

ఇదీ చూడండి: అక్రమార్కులపై దర్యాప్తునకు అధికారుల సమాయత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.