నిర్మల్ జిల్లాలోని కొండాపూర్ వద్ద వలస కూలీలు ప్రయాణిస్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ మేడ్చల్ నుంచి వలస కూలీలు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు.
ప్రమాద సమయంలో లారీలో సుమారు 60 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమించగామెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.
ఇవీ చూడండి: నలుగురితో నడపలేక.. నష్టాల్లో మునగలేక!