పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్‌లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీలు శ్రీనివాస్, వినోద్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన పోలీసులను, అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు. సామాజిక సేవల్లో ప్రతీ పౌరుడు ముందుండాలని ఆకాంక్షించారు.