నిర్మల్ జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలో శనివారం మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారి డాక్టర్ కార్తీక్ తెలిపారు. నిర్మల్ పట్టణంలో నాలుగు, బైంసా పట్టణంలో ఒక కేసు నిర్థరణయ్యాయి.
జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 81కి చేరింది. శనివారం వరకు జిల్లా వ్యాప్తంగా 1140 మంది రక్త నమూనాలు సేకరించారు. వీటిలో 28 యాక్టివ్ కేసులుండగా, ఒక్కరు ప్రభుత్వ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. హోం క్వారంటైన్లో 27 మంది ఉన్నారు.