ETV Bharat / city

కుమురం భీం మ్యూజియంకు తాళాలు.. ఎనిమిది నెలలుగా సిబ్బందే లేరు! - కుమురం భీం మెమోరియల్​ మ్యూజియం

జల్​.. జంగల్.. జమీన్​ అంటూ.. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గోండు వీరుడు కుమురం భీం పేరు మీద ఆయన సమాధి వద్ద నిర్మించిన జోడేఘాట్​ గిరిజన మ్యూజియం గత ఏడెనిమిది నెలలుగా తాళాలతో పర్యాటకులను వెక్కిరిస్తోంది. సిబ్బంది లేక.. భీమ్​ సమాధి అయిన వీరభూమి చుట్టూ గడ్డి మొలిచింది. ఈ నెల 30న కొమురం భీమ్​ 80వ వర్ధంతి సమీపిస్తున్నప్పటికీ.. అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.

Negligence on Jodeghat kumuram Bheem Memorial Museum
కుమురం భీం మ్యూజియంకు తాళాలు.. ఎనిమిది నెలలుగా సిబ్బందే లేరు!
author img

By

Published : Oct 11, 2020, 2:40 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్​లో కుమురం భీం జ్ఞాపకాలతో.. ఆయన వీరత్వానికి గుర్తుగా ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం గత ఏడెనిమిది నెలల నుంచి ఆలనాపాలనా లేకుండా వెలవెలబోతోంది. సిబ్బంది కొరతతో తాళాలు వేసిన తలుపులు పర్యాటకులను వెక్కిరిస్తున్నాయి.

కొత్త సిబ్బందిని అధికారులు నియమిస్తామని చెప్పి.. అసలు ఆ విషయాన్నే మరిచిపోయారని.. జోడేఘాట్​ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా సిబ్బందిని నియమించి జోడేఘాట్ మ్యూజియం తెరిపించాలని... పర్యాటకులు నిరాశ చెందకుండా దగ్గర ఉండి అన్ని చూపించి కుమురం భీం వీరగాథను వివరించేలా క్యూరేటర్​ను నియమించాలని జోడేఘాట్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

అక్డోబర్​30న కుమురం భీం 80వ వర్ధంతి సమీపిస్తున్న తరుణంలో.. ఇప్పటికీ ఐటీడీఏ అధికారులు జోడేఘాట్​ గిరిజన మ్యూజియంను పట్టించుకోకపోవడం శోచనీయమని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆశతో.. కుమురం భీం గురించ తెలుసుకోవాలని దూరప్రాంతాల నుంచి వస్తే.. చివరికి నిరాశే మిగులుతోందంటున్నారు.

సిబ్బందే లేరు..

నాడు జల్, జంగల్, జమీన్ కోసం నిజాం ప్రభుత్వంతో పోరాడి అసువులు బాసిన మన్యం వీరుడు కుమురం భీం పోరాట గడ్డ జోడేఘాట్​లోని గిరిజన మ్యూజియం లాక్​డౌన్​ కంటే మూడు నెలల ముందే మూసేశారు. జోడేఘాట్​లో డంపింగ్​ యార్డ్​ విషయంలో సిబ్బందికి, గ్రామస్థులకు నెలకొన్న వివాదంతో ఈ సమస్య ప్రారంభమైంది.

ఆ వివాదంతో అక్కడి నుంచి వెల్లిపోయిన సిబ్బంది.. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. వేరే మార్గం లేక.. నేటి వరకు మ్యూజియం మూతపడే ఉంది. కొత్త సిబ్బందిని నియమిస్తామని అధికారులు హడావుడి చేసినా.. అసలు ఆ ప్రస్తావనే ఎత్తడం లేదు.

పర్యాటకులకు తప్పని ఇబ్బందులు..

దూరప్రాంతాల నుంచి జోడేఘాట్​కు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి జోడేఘాట్​ను చూడడానికి వచ్చేవారు.. తాళాలు వేసి ఉండటం వల్ల నిరాశతో తిరుగుముఖం పడుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ చూపి మ్యూజియం తెరవాలని సందర్శకులు, గ్రామస్థులు కోరుతున్నారు.

నైజాం ప్రభుత్వంతో పోరాడిన వీరుడు కుమురం భీం జీవిత కథను తెలుసుకోవడానికి వచ్చిన సందర్శకులు నిరాశతో తిరుగుముఖం పడుతున్నారు. జోడేఘాట్ మ్యూజియం చూడటానికి వచ్చిన సంతోషం కూడా మిగలటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, జిల్లా అధికారులు పట్టించుకోని క్యూరేటర్​ను నియమించాలని జోడేఘాట్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

క్యూరేటర్​ను నియమిస్తే.. మ్యూజియం అభివృద్ధి చెందుతుందని... సందర్శకుల తాకిడి పెరిగి.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని గ్రామస్థులు అంటున్నారు. గోండు వీరుడు కుమురం భీం త్యాగాన్ని భావి తరాలకు తెలియాలంటే.. వెంటనే మ్యూజియం తెరిచి సందర్శకులకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:హమ్మయ్య: ఎట్టకేలకు చిరుత చిక్కింది... చింత తీరింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.