ETV Bharat / city

'దుర్వినియోగమైన డబ్బులను రికవరీ చేయాలి'

ఆదిలాబాద్‌ జడ్పీ సమావేశంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ 92 వ వార్షిక మహాజన సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి హాజరయ్యారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మరింత బలోపేతం కావాలంటే... ఇదివరకు దుర్వినియోగమైన డబ్బులను రికవరీ చేసి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.

minister indrakaran reddy fire on pacs fraud

author img

By

Published : Sep 29, 2020, 8:41 PM IST

రాష్ట్రప్రభుత్వం వచ్చాకే నిర్వీర్యమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పునరుజ్జీవం దిశగా పయనిస్తున్నాయని రాష్ట్ర అటవీపర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ సంఘాలు మరింత బలోపేతం కావాలంటే ఇదివరకు దుర్వినియోగమైన డబ్బులను రికవరీ చేసి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఆదిలాబాద్‌ జడ్పీ సమావేశంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ 92 వ వార్షిక మహాజన సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సమావేశానికి ఆదిలాబాద్‌, బోథ్‌, ఆసిఫాబాద్‌, ముథోల్‌ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాఠోడ్‌బాపురావు, ఆత్రం సక్కు, విఠల్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ నాందేవ్‌, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ లింగయ్య, డైరెక్టర్లు, పీఎసీఎస్‌ ఛైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమకు గౌరవవేతనంతో పాటు ప్రొటొకాల్‌ ప్రకారం మండలాల్లో జరిగే సమావేశాల్లో గౌరవ ఇవ్వాలని మంత్రిని సభ్యులు కోరగా.. తగు చర్యలు తీసుకునేలా కృషిచేస్తామని మంత్రి భరోసానిచ్చారు.

కొత్త మండలాల్లో బ్యాంకులు నెలకొల్పేందుకు చర్యలు తీసుకొని.. పీఏసీఎస్‌ వ్యవహారాలన్నీ రోజూవారీగా తెలిసేలా కంప్యూటీకరించి పాదర్శక సేవలందించాలని మంత్రి ఆకాంక్షించారు..

ఇదీ చూడండి: 'రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.