ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తూనే మరోపక్క వారి సమాచారం తెలుసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా పోస్టర్లతో ప్రచారం చేస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రధాన కూడళ్లు, ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల వద్ద, ప్రజలు సంచరించే ప్రాంతాల్లో మావోయిస్టుల ఫొటోలు, వివరాలున్న పోస్టర్లను అతికిస్తున్నారు.
‘సమాచారం మాకు.. బహుమతి మీకు’ అని ముద్రించిన ఈ పోస్టర్లలలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, మరో అయిదుగురు ఏరియా కమిటీ సభ్యుల ఫొటోలు, వారి సమాచారం అందించే వారికి అందజేసే నగదు బహుమతి వివరాలను ముద్రించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని మావల ఎస్సైలు రమేష్, రామయ్య పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు