Gurukul students: గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆదిలాబాద్ జిల్లా గిరిజన బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు కటింగ్‌కు డబ్బులు లేక... పెరిగిన జుట్టుతో ఉండలేక పిల్లలే ఒకరికొకరు క్షవరం చేసుకుంటున్నారు. ఇది వారి దైన్య పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ పాఠశాల జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉండటం విశేషం. అయినా అక్కడి ప్రిన్సిపల్, వార్డెన్‌లు మాత్రం గిరిజన విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడం వారి బరి నిర్లక్ష్యానికి పరాకాష్టగా తయారైంది.
చదువుకోవాల్సిన విద్యార్థులు: గిరిజన విద్యార్థులని చిన్న చూపో లేక మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరని తెగువో తెలియదు గాని చదువుకోవాల్సిన విద్యార్థులు క్షవరం చేసే పనిలో నిమగ్నమవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం క్షవరం కోసం నెలకు ఒక్కో విద్యార్థి పేరిట కేవలం 12 రూపాయలు ఇవ్వడం కూడా నెలల తరబడి విద్యార్థులకు క్షవరం చేయించక పోవడానికి మరో కారణంగా సిబ్బంది చెబుతున్నారు.
ఇదీ చదవండి:శిథిలావస్థలో సర్కారీ బడులు... బిక్కుబిక్కుమంటున్న పిల్లలు