ETV Bharat / city

మావల హరితవనంలో 4 కొండముచ్చులు మృతి - four monkeys died in mavala green garden

విద్యుదాఘాతంతో ట్రాన్స్​ఫార్మార్​పైనే చిక్కుకుని ఓ కొండముచ్చు మృతిచెందింది. దాన్ని కాపాడటానికి వచ్చిన మరో మూడు కొండముచ్చులు షాక్​ తగిలి కిందపడి మృత్యువాత పడ్డాయి.

four monkeys died of electric shock in mavala green garden in adilabad district
మావల హరితవనంలో 4 కొండముచ్చులు మృతి
author img

By

Published : Jul 25, 2020, 2:44 PM IST

ఆదిలాబాద్ జిల్లా మావల హరితవనంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెట్లపై నుంచి ఎగురుతూ వచ్చిన ఓ కొండముచ్చు అక్కడే ఉన్న ట్రాన్స్​ ఫార్మర్​పై కూర్చోవడం వల్ల విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. దాన్ని కాపాడటానికి వచ్చిన మరో మూడు కొండముచ్చులు షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాయి.

కిందపడిన కొండముచ్చుల్లో రెండింటిని మిగిలిన కొండముచ్చులు అటవీప్రాంతానికి తీసుకెళ్లాయి. ఉదయపు నడకకు వెళ్లిన కొందరు వ్యక్తులు ట్రాన్స్​ఫార్మర్​ వద్దనే పడి ఉన్న వాటిని కదిలించేందుకు ప్రయత్నించగా.. కొండముచ్చులు దాడికి యత్నించాయి. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.