ETV Bharat / city

జోరుగా నకిలీ విత్తనదందా... అధికారుల అలసత్వంపై రైతుల ఆరోపణ

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వ్యవసాయశాఖ పనితీరు చూస్తుంటే... చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కనిపిస్తోంది. కంపెనీలు తయారుచేసిన విత్తనాల నాణ్యతను.. రైతులకు పంపిణీ చేయకముందే పరిశీలించాల్సి ఉంటుంది. కానీ రైతులు కొనుగోలు చేసి నాట్లేసిన తర్వాత పరిశీలించడంతో నకిలీ విత్తనాలని తెలిసినా... అప్పటికే నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

జోరుగా నకిలీ విత్తనదందా
జోరుగా నకిలీ విత్తనదందా
author img

By

Published : Jun 12, 2021, 10:39 AM IST

అధికారులు ఆలస్యంగా తనిఖీలు చేస్తున్నారని రైతుల ఆరోపణ

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి, సోయా నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. ఏపీ, మహారాష్ట్ర నుంచి నిషేధిత విత్తనాలను తెచ్చి కొంతమంది వ్యాపారులు... రైతులకు అంటగడుతున్నారు. ఆదిలాబాద్‌లో రెండు, ఇచ్చోడ, గుడిహత్నూర్‌ మండలాల్లో మూడు దుకాణాల్లో అనుమతి లేని విత్తనాలు లభించడంతో వ్యవసాయశాఖ కేసులు నమోదు చేసింది. తాండూరు, కోటపెల్లి, మందమర్రి, నార్నూర్‌, ఉట్నూర్‌, జైనూర్‌, బోథ్‌, ఇచ్చోడ, ఆదిలాబాద్‌లో కొంతమంది వ్యాపారులు సిండికేట్‌గా మారి నకిలీ విత్తన దందా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిబంధనల ప్రకారమైతే కంపెనీలు వ్యాపారులకు సరఫరా చేసిన విత్తనాల నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని ప్రత్యేక ల్యాబోరేటరీలో బ్యాచ్‌నంబర్‌, లాట్‌ నంబర్‌, తయారుదారుడు, ఎక్కడ తయారుచేశారు.? జర్మనేషన్‌లాంటి విషయాలపై వ్యవసాయశాఖ పరీక్షలు చేయించాల్సి ఉంది. ల్యాబోరేటరీలో నాణ్యత విత్తనాలని నిర్ధారణ అయినవాటినే రైతులకు విక్రయించడానికి అనుమతించాల్సి ఉంది. కానీ అధికారులు నిబంధనలు పాటించడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుతో అన్నదాతలు నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. కొందరు రైతులు ఇప్పటికే విత్తనాలు కొని నాట్లు ప్రారంభించారు. ఇప్పుడు అధికారులు తనిఖీలు చేసి నకిలీ విత్తనాలు, నిషేధిత విత్తనాలు అంటూ కేసులు పెడితే... ఇప్పటికే నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.

రైతులకు నకిలీ విత్తనాలు అంటగడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దుకాణాల్లో నకిలీ, నిషేధిత, అనుమతి లేని విత్తనాలు అమ్మిన వారిపై కేసులు పెడుతున్నట్లు వెల్లడించారు. నకిలీ విత్తనాలు కొని రైతులు నష్టపోతే పరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.