ETV Bharat / city

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: అవినీతిపై అధికారులు అప్రమత్తం - ఆదిలాబాద్ జిల్లా వార్తలు

ఆదిలాబాద్‌ జిల్లాలో షాదీముబారక్‌, కల్యాణలక్ష్మీ అవినీతిపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఈటీవీ భారత్​- ఈనాడులో కథనం రావడంతో... అధికారుల్లో కదలిక ప్రారంభమైంది. క్షేత్రస్థాయిలో జరిగిన అక్రమాలను ఆరా తీయాలని జిల్లాలోని... తహసీల్దారులందరికీ ఉన్నతాధికారి ఆదేశాలు జారీచేశారు.

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: అవినీతిపై అధికారులు అప్రమత్తం

author img

By

Published : Nov 18, 2020, 8:32 AM IST

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: అవినీతిపై అధికారులు అప్రమత్తం

ప్రభుత్వం అందిస్తున్న షాదీముబారక్‌, కల్యాణలక్ష్మీ సాయాన్ని కొంతమంది కాజేసే తతంగం ఆదిలాబాద్‌ జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. సిరికొండ, బోథ్‌, గుడిహత్నూర్‌, నేరడిగొండ, ఇచ్చోడ మండలాల్లో కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు... అక్రమాలకు పాల్పడిన వ్యవహారంపై ఈటీవీ భారత్​ - ఈనాడులో కథనం రావడం... అధికారుల్లో కదలిక తీసుకొచ్చింది. ఈ అవినీతిలో.. ఆదిలాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో షాదీముబారక్, కల్యాణలక్ష్మీ సెక్షన్‌ ఇన్​ఛార్జిగా చేస్తున్న నదీం అనే ఉద్యోగి పాత్ర ఉన్నట్లు అధికారులు తేల్చారు. అతణ్ని కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపారు.

15 మంది పేరుతో..

బోథ్‌ పరిధిలోని గుడిహత్నూర్‌ మండలంలో తండ్రిపేరును మార్చి 15 మందికి రెండుసార్లు రూ.1,00,116 చొప్పున మొత్తం... ఇప్పించి రూ.15,01,740 కాజేసినట్లు వెల్లడైంది. బోథ్‌ మండలంలో తొమ్మిది మంది లబ్దిదారులపేరిట రూ.9.44 లక్షలు స్వాహా చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. సిరికొండ మండలంలో రూ.4,00,464 మేర అవినీతి జరిగినట్లు అధికారులు నిర్ధరించారు. మరోవైపు మంజూరు చేసిన డబ్బులు అందలేదని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయవర్గాల్లోనూ కలవరం..

ప్రజాప్రతినిధుల సమక్షంలో చేసిన చెక్కుల పంపిణీల్లో అవినీతి బయటపడటం.. రాజకీయవర్గాల్లోనూ కలవరం పుట్టిస్తోంది. బోథ్‌, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లోని మీసేవా కేంద్రాలు, తహసీల్దార్‌ లాగిన్ల ద్వారా అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తెరాస ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో వెలుగుచూస్తున్న అవినీతిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ అవినీతిపై నిఘావర్గాలు ఆరాతీయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత కథనం: అధికారుల చేతివాటం.. మసకబారుతున్న సంక్షేమ పథకాల ప్రతిష్ఠ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.