కరోనా వ్యాధిని కట్టడి చేయడానికి ఆదిలాబాద్ పట్టణాన్ని అధికారయంత్రాంగం అష్టదిద్బంధనం చేసింది. వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే 19 వార్డుల్లోని ప్రజలు.. బయటకు రాకుండా బారికేడ్లు నిర్మించింది. పట్టణ పరిధిలోని ఎవరైనా... కేవలం ఎన్టీఆర్ చౌక్ నుంచి బయటకు వెళ్లడం, తిరిగి అక్కడి నుంచే పట్టణంలోకి ప్రవేశించేలా... ఒకే ఒక మార్గం ఏర్పాటు చేసింది.
పట్టణ పరిధిలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన తరుణంలో అధికారయంత్రాంగం 112 ప్రత్యేక బృందాలతో సర్వే చేపట్టింది. అనవసరంగా బయటకు వచ్చినవారికి పోలీసులు లాఠీ ఝళిపిస్తున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా నిన్నటిదాకా తెరిచి ఉంచిన కిరాణా దుకాణాలను అధికారులు మూసివేశారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు స్వయంగా పరిశీలించారు. ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: మాస్క్ మళ్లీ మళ్లీ వాడేలా.. లామినేట్ షీట్‌తో ప్రయోగం