రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నా లేనట్లేనని... ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యానించారు. నూతన వ్యవసాయ చట్టాలపై భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో... ఆదిలాబాద్‌కు ముఖ్యమంత్రైనా.. కేంద్రమంత్రైనా... కిషన్ రెడ్డే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైన గిరిజన విశ్వవిద్యాలయాన్ని... కేసీఆర్ వరంగల్‌కు తరలించారని ఆరోపించారు. ప్రధానమంత్రితో మాట్లాడి ఉట్నూర్‌లో ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రెండు పడక గదుల ఇళ్లు ఎవరికీ రావడం లేదని... ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రెండు లక్షల ఇళ్లు మంజూరు చేయించాలని కోరారు.
ఇదీ చూడండి: 'రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే నూతన సాగు చట్టాలు'