ఆదిలాబాద్ రిమ్స్ కళాశాల ఎదుట భాజపా ఆందోళన చేపట్టింది. ఎంపీ సోయం బాపురావు, భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్... పార్టీ శ్రేణులతో కలిసి డైరెక్టర్ ఛాంబర్ ముందు బైఠాయించారు. కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి ఈటల వ్యాఖ్యల పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎంపీ సోయం... కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు: లక్ష్మణ్