ETV Bharat / business

Women Saving Scheme : మహిళా సమ్మాన్ సేవింగ్స్​​ సర్టిఫికెట్​.. ఇకపై బ్యాంకుల్లోనూ లభ్యం!

Mahila Samman Savings Certificate : కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం 'మహిళా సమ్మాన్​ సేవింగ్స్​ సర్టిఫికెట్​' పేరిట చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా పొదుపు చేసిన మొత్తంపై 7.5 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. మొదట్లో పోస్టు ఆఫీస్​లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ స్కీమ్.. ఇప్పుడు బ్యాంకుల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Mahila Samman savings certificate in banks
Woman Saving Schemes
author img

By

Published : Jul 28, 2023, 5:56 PM IST

Mahila Samman Savings Certificate : డబ్బులు ఆదా చేసుకునేందుకు లేదా పెట్టుబడి పెట్టేందుకు అనేక మర్గాలు మనకు అందుబాటులో ఉంటాయి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అదే బ్యాంకులు, పోస్టాఫీస్‌లలో అందుబాటులో ఉండే స్కీమ్స్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల అధిక వడ్డీ రాస్తుంది. పైగా మీ డబ్బులకు భరోసా ఉంటుంది. దీనితో ఎలాంటి రిస్క్‌లేని వీటిల్లో డబ్బులు దాచుకునేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తారు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్
Mahila Samman Savings Certificate Scheme : ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్' పథకాన్ని ప్రకటించారు. మహిళల, బాలికల ఆర్థిక సాధికారితను ప్రోత్సహించడానికి ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రారంభంలో ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీసులో మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇప్పుడు ఈ పథకాన్ని బ్యాంకులకు కూడా వర్తింపుజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఈ ఏడాది జూన్ 27న గెజిట్ విడుదల చేశారు. కనుక ఇకపై అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, క్వాలిఫైడ్​ ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ పొదుపు పథకం అమల్లోకి రానుంది.

అమల్లోకి తెచ్చిన నాలుగు బ్యాంకులు
MSSC Scheme in Banks : ప్రస్తుతం నాలుగు బ్యాంకులు మహిళా సమ్మన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌ను మహిళలు, బాలికల కోసం అందుబాటులోకి తెచ్చాయి. మహిళల అభివృద్ధి కోసం దీనిని అమల్లోకి తెచ్చినట్లు ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించాయి. త్వరలో మిగతా బ్యాంకులు కూడా ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చే అవకాశముంది.

వడ్డీ ఎంత ఉంటుందంటే..?
Mahila Samman Savings Certificate Interest Rate : మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం అనేది రెండు సంవత్సరాల డిపాటిజ్ పథకం. ఇందులో డిపాజిట్ చేసినవారికి సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఈ పథకం 2025 మార్చి 31 వరకు అంటే రెండేళ్లపాటు అమలులో ఉంటుంది.

ఎవరు అర్హులు?
Mahila Samman Saving Certificate Eligibility : భారతదేశంలోని ప్రతీ మహిళ, బాలిక ఈ పథకానికి అర్హులు. మహిళలు సొంతంగా ఈ ఖాతాను తెరుచుకోవచ్చు. లేదా మహిళల తరపున వారి కుటుంబసభ్యులు లేదా బంధువులు ఓపెన్ చేయవచ్చు. మైనర్ బాలికల పేరుతో తల్లిదండ్రులు తెరవాల్సి ఉంటుంది.

ఎంత వరకు డిపాజిట్ చేయవచ్చు
Mahila Samman Savings Certificate Deposite Amount : ఈ స్కీమ్ కింద రూ.2 లక్షల వరకు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకేసారి రూ.2 లక్షలు డిపాజిట్​ చేయవచ్చు లేదా కనిష్ఠంగా రూ.1000 చొప్పున విడతల వారీగా అయినా డిపాజిట్ చేయవచ్చు. ఒకరు.. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కూడా తెరుచుకునే అవకాశముంది. కాకపోతే ఒక ఖాతా తర్వాత మరొక ఖాతా తెరవడానికి.. కనీసం మూడు నెలల గ్యాప్ ఉండాలి.

డబ్బులు తిరిగి పొందటం ఎలా?
Mahila Samman Savings Certificate Tax Benefit : అవసరమైతే ఒక సంవత్సరం తర్వాత జమ చేసిన డబ్బులో 40 శాతం వరకు తీసుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి చొప్పున వడ్డీ జమ చేస్తారు. అలాగే దీనిపై వచ్చే ఆదాయానికి నిబంధనల ప్రకారం పన్ను ఉంటుంది. కానీ టీడీఎస్ అనేది ఉండదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.