ETV Bharat / business

ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోతే ఏం చేయాలి?

ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాలలో చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయి.. నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అదే సమస్య భారతదేశంలో తలెత్తితే.. ముందుగా ఎలా సిద్ధమవ్వాలో తెలుసుకుందాం!

economic downturn
ఆర్థిక మాంద్యం
author img

By

Published : Nov 4, 2022, 10:19 AM IST

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అలముకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థూల ఆర్థిక అనిశ్చితిని తట్టుకునేందుకు మన దేశం సర్వసన్నద్ధంగానే ఉంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు బాగాలేనప్పుడు ఆ ప్రభావం మన దేశంపైనా ఉంటుంది అనడంలో సందేహం లేదు. గత కొన్ని త్రైమాసికాలుగా ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. స్టాక్‌ మార్కెట్లలోనూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారనే వార్తలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎవరైనా ఉద్యోగం మానేయాల్సి వస్తే ఏం చేయాలి? ఆర్థికంగా ఎలా సిద్ధం అవ్వాలి? తెలుసుకుందాం.

చేస్తున్న ఉద్యోగం కోల్పోతే ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఎదురవుతుంది. ఏం చేయాలో తెలియక ఆందోళన చెందడం సహజమే. ఇలాంటి అనుకోని సంఘటన ఎదురవ్వాలని ఎవరూ అనుకోరు. కానీ, కాలం ఇలాంటి తప్పనిసరి పరిస్థితిని సృష్టిస్తే ఏం చేయాలి? అనే ఆలోచన కన్నా.. ముందు నుంచీ సిద్ధంగా ఉండటమే ఎప్పుడూ మేలు.

పొదుపు ప్రారంభించండి..
మన చేతిలో ఎప్పుడూ 3-6 నెలల ఖర్చులు, ఈఎంఐలకు సరిపడా డబ్బు ఉండాలన్న సంగతి తెలిసిందే. దీన్ని సాధించేందుకు జీతంలో కనీసం 25 శాతం వరకూ రికరింగ్‌ డిపాజిట్‌ పథకంలో జమ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ వేతనానికి 3 రెట్లు 12 నెలల కాలంలో జమ చేయగలరు. 6 రెట్లు జమ చేసేందుకు 23 నెలలు పడుతుంది. ఇప్పటికే మీ దగ్గర అత్యవసర నిధి ఉంటే.. దాన్ని పొదుపు ఖాతాలో కాకుండా.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లోకి మళ్లించండి. అనుకోకుండా ఉద్యోగం పోతే.. ఈ మొత్తాన్ని జీతం వస్తున్నట్లుగానే భావించి, నెలనెలా వెనక్కి తీసుకోవాలి. కేవలం అత్యవసరాలు అంటే.. నిత్యావసరాలు, ఇంటి అద్దె, ఈఎంఐలు తదితర వాటికే ఉపయోగించాలి.

అప్పులు తగ్గించుకోండి..
ఆదాయం లేనప్పుడు అప్పు చేయక తప్పని స్థితి వస్తుంది. సాధ్యమైనంత వరకూ ఉన్న నిధులతోనే కాలం వెళ్లదీసేందుకు ప్రయత్నించండి. మళ్లీ మంచి రోజులు వచ్చాకే అనుకున్నట్లుగా ఖర్చు చేయొచ్చు. ఒకవేళ మీరు పనిచేస్తున్న రంగంలో ఉద్యోగాల కోత ప్రారంభం అయ్యింది అనిపిస్తే.. క్రెడిట్‌ కార్డులవంటి వాటిని ఉపయోగించడం మానేయండి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. వీలైనంత వరకూ పొదుపు చేసేందుకు ప్రయత్నించండి. ఉద్యోగం కోల్పోతే.. సాధ్యమైనంత వరకూ క్రెడిట్‌ కార్డుకు దూరంగా ఉండండి. ఆదాయం లేనప్పుడు కార్డు బిల్లులను సకాలంలో చెల్లించలేకపోవచ్చు. ఇది మీ రుణ చరిత్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

విచక్షణతో..
పొదుపు చేయాలంటే.. ఖర్చులు తగ్గాలి. వృథా వ్యయాలు మీ బడ్జెట్‌పై ఎంత మేరకు ప్రభావం చూపిస్తున్నాయన్నది తెలుసుకునే ప్రయత్నం చేయండి. కొన్నింటికి ప్రత్యామ్నాయాలు తప్పకుండా ఉంటాయి. వీటిని ఉపయోగించుకునేందుకు చూడాలి. ఖరీదైన వస్తువులు, విందులకు దూరంగా ఉండటం మంచిది. కొన్ని కోరికలనూ వదిలిపెట్టాలి. దీనివల్ల మిగులు మొత్తం మరింత పెరుగుతుందని గుర్తుంచుకోండి.

ప్రత్యేకంగా పాలసీ..
యాజమాన్యం అందించే బృంద ఆరోగ్య బీమా రక్షణలో ఉన్నవారు సొంతంగా ఒక పాలసీ తీసుకోవాలి. ఉద్యోగం మానేసినప్పుడు బృంద బీమా రక్షణ దూరం అవుతుందని మర్చిపోవద్దు. ఉద్యోగం లేని కాలంలో ఏదైనా అనుకోని అనారోగ్యం బారిన పడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొదుపు మొత్తం చికిత్స కోసం కేటాయించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి, ఈ విషయంలో ఆలస్యం చేయొద్దు.

వెనక్కి తీసుకోవద్దు..
ఆదాయం కోల్పోయినప్పుడు చాలామంది ఒకేసారి మొత్తం పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు. ఇది మంచిది కాదు. ముందుగా అత్యవసర నిధిని ఉపయోగించుకోవాలి. ఆదాయం లేదు అన్న సంగతిని గుర్తుపెట్టుకొని ఖర్చు చేయాలి. తప్పదు అనుకున్నప్పుడే ప్రావిడెంట్‌ ఫండ్‌, ఈక్విటీల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోండి.
- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.