ETV Bharat / business

వేతనాల పెంపు ఖాయం, 3 నెలలకోసారి ప్రమోషన్‌ - విప్రో శాలరీ హైక్

ఉద్యోగుల వేతనాల పెంపును ఆపడం లేదని ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో స్పష్టం చేసింది. ప్రమోషన్లు సైతం క్రమంగా అమల్లోకి వస్తున్నాయని తెలిపింది. మెరుగైన ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు త్రైమాసికాలవారీగానూ ప్రమోషన్లు ఇస్తామని పేర్కొంది.

wipro salary hike news 2022
wipro salary hike news 2022
author img

By

Published : Aug 18, 2022, 4:14 PM IST

Wipro salary hike: సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రావాల్సిన ఉద్యోగుల వేతనాల పెంపును ఆపడం లేదని ప్రముఖ ఐటీ సంస్థ విప్రో వెల్లడించింది. మీడియాలో వస్తున్నట్లుగా తాము ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇప్పటికే తొలి దశ ప్రమోషన్లు కూడా పూర్తయ్యాయని తెలిపింది.
Wipro salary hike news 2022: ఏప్రిల్‌-జూన్‌లో విప్రో లాభాలు తగ్గాయి. దీంతో ఉద్యోగుల వేతనాల్లో భాగమైన 'వేరియబుల్‌ పే'ను కంపెనీ నిలిపివేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీ స్పందించింది. అయితే, వేతనాల పెంపుపై మాత్రమే స్పష్టతనిచ్చింది. 'వేరియబుల్‌ పే' చెల్లింపు మొత్తంపై మాత్రం తాము ఎలాంటి ప్రకటన చెయలేమంటూ సమాధానాన్ని దాటవేసింది. ఈ కంపెనీ ప్రతి మూడు నెలలకొకసారి ఉద్యోగులకు 'వేరియబుల్‌ పే' చెల్లిస్తుంటుంది.

మరోవైపు జులై నుంచి ప్రమోషన్లు క్రమంగా అమల్లోకి వస్తున్నాయని విప్రో తెలిపింది. అలాగే మెరుగైన ప్రతిభ కనబరిచిన 'మిడ్‌ మేనేజ్‌మెంట్‌' స్థాయి వరకు ఉద్యోగులకు త్రైమాసికాలవారీగానూ ప్రమోషన్లు ఇస్తామని తెలిపింది. ఏప్రిల్‌-జూన్‌లో విప్రో మార్జిన్లు వార్షిక ప్రాతిపదికన 18.8 శాతం నుంచి 15 శాతానికి తగ్గాయి. ఐటీ రంగంలో ఉద్యోగుల వలసల రేటు అధికంగా ఉండడంతో ఇటీవల కంపెనీలు వేతనాలను భారీగా పెంచాయి. దీనివల్లే తమ మార్జిన్లు తగ్గినట్లు పలు కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాల వ్యాఖ్యానాల్లో పేర్కొన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.