ETV Bharat / business

వాట్సాప్​ బంపర్​ ఆఫర్​.. ఆ ఫీచర్​ వాడితే భారీగా క్యాష్​బ్యాక్​​ - వాట్సాప్​ పేమెంట్స్​

Whatsapp pay cashback offer: పేమెంట్స్​ ప్లాట్​ఫామ్​​ వైపు కస్టమర్లను ఆకర్షించేందుకు బంపర్​ ఆఫర్​ ప్రకటించింది వాట్సాప్​. వాట్సాప్​ పే ద్వారా చెల్లింపులు చేసే వారికి క్యాష్​బ్యాక్​ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఒక్క రూపాయి పంపినా.. క్యాష్​బ్యాక్​ ఆఫర్​ వర్తిస్తుందని పేర్కొంది. అయితే.. గరిష్ఠంగా ఎంత క్యాష్​బ్యాక్​ వస్తుంది. ఎన్నిసార్లు పంపినా ఆఫర్​ వర్తిస్తుందా?

whatsapp pay cashback offer
వాట్సాప్​ పే క్యాష్​బ్యాక్​ ఆఫర్​
author img

By

Published : Apr 27, 2022, 7:11 PM IST

Whatsapp pay cashback offer: సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్​ వినియోగదారులకు బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. వాట్సాప్​ పేమెంట్స్​ను ఉపయోగించుకునేలా కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు క్యాష్​బ్యాక్​ అందించేందుకు సిద్ధమైంది. అలాగే.. వాట్సాప్​ ద్వారా వ్యాపార చెల్లింపులను తీసుకురావడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా ప్రస్తుతం భారత్​లో యూపీఐ లావాదేవీల్లో దూసుకెళ్తున్న గూగుల్​ పే, ఫోన్​పే వంటి వాటికి పోటీ ఇచ్చేందుకు వీలు కలగనుంది.

ఇటీవలే వాట్సాప్​ పేమెంట్​ సర్వీస్​ లిమిట్​ను 100 మిలియన్​ యూజర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా(ఎన్​పీసీఐ). ఇప్పటికే భారత్​లో 400 మిలియన్లకుపైగా వినియోగదారులు ఉన్న వాట్సాప్​కు అది పెద్ద సానుకూల అంశం.

క్యాష్​బ్యాక్​ ఆఫర్​ ఇలా: వాట్సాప్​ ద్వారా చెల్లింపులు​ చేసే వారికి ఇప్పటికే రూ.33 వరకు క్యాష్​బ్యాక్ ఆఫర్​ చేస్తున్నట్లు​ రాయిటర్స్​ ఓ కథనంలో పేర్కొంది. వాట్సాప్​ పే ద్వారా తమ చాట్​ విండో నుంచే నేరుగా కాంటాక్ట్స్​లో ఉన్న వారికి నగదు పంపించవచ్చు. వాట్సాప్​లో క్యాష్​బ్యాక్​ పొందాలంటే నగదు చెల్లింపులపై ఎలాంటి కనీస పరిమితులు లేవు. ఒక రూపాయి సైతం పంపించొచ్చు. వారు కూడా క్యాష్​బ్యాక్​కు అర్హులే. అయితే.. ఈ ఆఫర్​ మూడు లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది. ఇంత తక్కువ నగదును పంపించే వీలు ఉండటం వల్ల వాట్సాప్​ పే​కు వినియోగదారులు మారేందుకు అవకాశం లభిస్తోందని సంస్థ పేర్కొంది. అలాగే.. వాట్సాప్​లో చెల్లింపుల సామర్థ్యాన్ని పెంచేందుకు దశలవారీగా ఈ క్యాష్​బ్యాక్ ​క్యాంపెయిన్​ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: సరికొత్త ఫీచర్లతో వాట్సాప్.. ఒకేసారి 32 మందితో

వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్.. ఏమిటంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.