Vodafone Idea Yearly Recharge Plans 2024 : భారత్‌లో మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వొడాఫోన్ ఐడియా తమ కస్టమర్ల కోసం బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తోంది. వీటిలో ఇయర్లీ ప్లాన్స్ 5 ఉన్నాయి. ఈ ప్లాన్ల ఖరీదు కాస్త ఎక్కువయినప్పటికీ, అందుకు తగ్గ మంచి బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. వినియోగదారులకు కేవలం మెుబైల్ ఇంటర్నెట్ సేవలే కాకుండా, ఇతరత్రా ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్స్లను కూడా అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌ల్లో రూ.1799 ప్లాన్ అన్నంటికంటే కాస్త చీప్‌గా వస్తోంది. రూ.3199 ప్లాన్ అన్నింటికంటే ఖరీదైనది. ఈ ఐదు ప్లాన్ల రీఛార్జ్ వ్యాలిడిటీ ఏడాది పాటు ఉంటుంది. వీటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vodafone Idea 1799 Plan
ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే ఏడాదిపాటు అన్లిమిటెడ్ కాల్స్‌తో పాటు, 24జీబీ డేటా, ప్రతిరోజు 100 SMSలు లభిస్తాయి. వీటితో పాటు వీఐ మూవీస్ & టీవీ యాప్స్‌ను కూడా ఉచితంగా వాడుకోవచ్చు.
Vodafone Idea 2899 Plan
ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేస్తే ఏడాది పాటు అన్లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజు 1.5 జీబీ డేటా, రోజు 100 SMSలు చొప్పున లభిస్తాయి. వీటికి అదనంగా వీఐ టీవీ, వీఐ మూవీస్, వీఐ హీరో అన్లిమిటెడ్ బెనిఫిట్స్ కూడా అందుతాయి. ముఖ్యంగా వీఐ హీరో అన్‌లిమిటెడ్‌లో భాగంగా వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్స్, బింజ్ ఆల్ నైట్ బెనిఫిట్స్ దొరుకుతాయి.
- డేటా రోల్ఓవర్ అంటే, మీరు ఈ నెలలో ఉపయోగించాల్సిన డేటాలో కొంత మిగిలిపోతే, దానిని వచ్చే నెలలో కూడా వాడుకోవచ్చు.
- డేటా డిలైట్ అంటే, ప్రతి నెలా అదనపు ఖర్చు లేకుండా 2జీబీ వరకు డేటా బ్యాకప్ లభిస్తుంది.
- బింజ్ ఆల్ నైట్ అంటే, మీరు రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు, ఎలాంటి అదనపు డబ్బులు చెల్లించకుండా, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వాడుకోవచ్చు.
Vodafone Idea 2999 Plan
ఈ ప్లాన్‌ను రీఛార్చ్ చేసుకుంటే 850 జీబీ డేటా ఒకేసారి వస్తుంది. దానితోపాటు ఏడాదంతా అన్లిమిటెడ్ కాల్స్, రోజూ 100 SMSలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ ద్వారా కేవలం వీఐ మూవీస్, టీవీ యాప్‌లు మాత్రమే అదనంగా లభిస్తాయి.
Vodafone Idea 3099 Plan
ఈ ప్లాన్‌ను తీసుకుంటే, ప్రతిరోజు 2జీబీ డేటాతోపాటు, 100 SMSలు, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వీటితో పాటు వీఐ మూవీస్ & టీవీ, డిస్నీ+హాట్‌స్టార్, బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్స్ లాంటి బెనిఫిట్స్ లభిస్తాయి. ప్రస్తుతం ఈ ప్లాన్‌ను వీఐ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే, రూ.75 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
Vodafone Idea 3199 Plan
ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే, ప్రతిరోజు 2జీబీ డేటాతోపాటు, అన్లిమిటెడ్ కాల్స్, 100 SMSలు చేయవచ్చు. అదనంగా వీఐ టీవీ & మూవీస్, బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్స్ లభిస్తాయి. ఒక సంవత్సర కాలవ్యవధితో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
కారు ఇన్సూరెన్స్ డీలర్ దగ్గరే తీసుకోవాలా? వేరే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా?
మీరు ఉద్యోగులా? మీ జీతంపై కట్టాల్సిన ఆదాయ పన్నును సింపుల్‌గా లెక్కించండిలా!