ETV Bharat / business

మీ కారు వర్షపు నీటిలో మునిగిందా? ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ చేసుకోండిలా.. - వెహికిల్​ ఇన్సూరెన్స్ వరదలు పూర్తి వివరాలు

Flood Insurance : దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలు పెద్ద ఎత్తున ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. మరి మన కారు వర్షపు నీటిలో మునిగిపోతే ఏం చేయాలి? వాహన బీమా కంపెనీలు ఆ నష్టానికి పరిహారం చెల్లిస్తాయా? చెల్లిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

How To Claim Vehicle Insurance In Monsoon
మీ కారు వర్షపు నీటిలో మునిగిందా.. మరి ఇన్సూరెన్స్​ ఎలా క్లెయిమ్​ చేసుకోవాలి..?
author img

By

Published : Jul 21, 2023, 11:18 AM IST

Vehicle Insurance In Flood : మొన్నటి వరకు ఉత్తర భారతాన్ని భయపెట్టిన వర్షాలు తాజాగా దక్షిణాదికి విస్తరించాయి. దీంతో రైతులుకు కాస్త ఉపశమనం కలిగినా.. పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మాత్రం ఈ వర్షాలు అనేక విధాల నష్టాలను కలిగిస్తుంటాయి. ఇందులో ప్రధానమైనది ఆస్తి నష్టం. అవును అతిభారీ వర్షాల వల్ల దాదాపు అన్నిచోట్ల ఈ రకమైన నష్టాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా కార్లు పాడవటం. అయితే మనం ఇంటిబయట పార్క్​ చేసి ఉంచిన కారు కానీ.. బయటకు వెళ్లనప్పుడు అనుకోకుండా కురిసిన వర్షాలకు వరద నీటిలో మునిగిపోతే ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటారు వాహన బీమా క్లెయిమ్​ గురించి అంతగా అవగాహన లేనివాళ్లు. అలాంటి వాళ్లు ముందుగా ఈ విషయాలను తెలుసుకుంటే మనం తీసుకునే వెహికిల్​ ఇన్సూరెన్స్​ పాలసీ ద్వారా కొంతవరకైనా నష్టాన్ని క్లెయిమ్​ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం మనం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

  • Flood Vehicle : ముందుగా కారు వరదల్లో చిక్కుకుపోయినప్పుడు లేదా కారులోకి నీరు చేరినప్పుడు దాని ఇంజిన్‌ స్టార్ట్‌ చేసేందుకు అస్సలు ప్రయత్నించకూడదు. అలా చేస్తే మన ప్రమేయంతోనే కారు మరింత పాడయ్యే అవకాశం ఉంటుంది గనుక అటువంటి పరిస్థితుల్లో బీమా సంస్థలు పరిహారం చెల్లించడానికి తిరస్కరిస్తాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే బీమా క్లెయిమ్​కు ఛాన్స్​ ఉంటుంది.
  • అయితే కారు పాడవ్వటానికి గల కారణాలను తెలియజేస్తూ కొన్ని ఆధారాలను బీమా కంపెనీలకు సమర్పించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైంది నీటిలో మునిగి ఉన్న కారు ఫొటోలు. అందుకే ఆ పరిస్థితి వచ్చిన వెంటనే వీలైనంత త్వరగా సాధ్యమైనన్ని ఫొటోలను అన్ని యాంగిల్స్​లో తీసి పెట్టుకోండి. ఇవి పరిహారం పొందండంలో కీలక పాత్ర పోషిస్తాయి.
  • ముఖ్యంగా కారు నీటిలో చిక్కుకున్నప్పుడు దానిలోపలికి వర్షపు నీరు చేరుతుంది. అయితే అలా మీ కారు వరదలో మునిగిన వెంటనే ఆ విషయాన్ని సంబంధిత బీమా సంస్థకు తెలియజేయాలి. ముందుగా బీమా సంస్థ సేవా కేంద్రానికి ఫోన్​ చేసి సమాచారం ఇవ్వడం లేదా ఈ-మెయిల్​ ద్వారానైనా తెలియజేయొచ్చనే విషయాన్ని మర్చిపోవద్దు. ఏం జరిగింది.. ఎలా జరిగింది అనే విషయాలను సవివరంగా తెలియజేయండి.
  • ప్రస్తుతం చాలా వరకు ఇన్సూరెన్స్​ కంపెనీలు వాట్సాప్​ ద్వారానే సమాచారాన్ని స్వీకరిస్తున్నాయి. కాబట్టి నీటిలో చిక్కుకొని ఉన్న ఫొటోలతో పాటు అవసరమైన ఆధారాలు వాట్సాప్​లోనే వీలైనంత త్వరగా పంపేందుకు ప్రయత్నించండి.
  • కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌ సహా బీమా యాప్‌లలోనూ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ సదుపాయాన్ని కూడా వాడుకోవచ్చు.

అయితే పైన తెలిపిన విధంగా ఏ రకంగా మీరు సమాచారం అందించినా సాధ్యమైనంత త్వరగా చెప్పడమే ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి. మీరు క్లెయిమ్​ కోసం అప్లై చేసుకున్నప్పటి నుంచి ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా నోట్​ చేసుకోండి. ఈ విషయంలో మీరు ఎవరెవర్ని సంప్రదించారు వంటి వివరాలను కూడా భద్రపరుచుకోండి.

నష్టాన్ని ఎలా అంచనా వేస్తారు?
Flood Car Insurance : మీరు సమాచారం అందించిన వెంటనే కారుకు జరిగిన నష్టాన్ని అంచనా వేయటానికి ఒక సర్వేయర్​ను పంపుతుంది బీమా కంపెనీ. అయితే మీరు సేకరించి పెట్టుకున్న పూర్తి వివరాలను సర్వేయర్​ అడిగిన దాని ప్రకారం సమర్పించండి. అయితే కొన్నిసార్లు ముఖ్యంగా కారు వరద నీటిలో కొట్టుకుపోయినప్పుడు దాని ఆచూకీ లభించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అప్పుడు పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేస్తారు. అటువంటి సందర్భాల్లో బీమా కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆధారాలను అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎఫ్​ఐఆర్​ వివరాలు కూడా సంస్థకు కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అలా అయితేనే జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేసేందుకు వీలుంటుంది. అప్పుడే పరిహారం అందుతుంది.

Flood Insurance Companies : ఇదిలా ఉంటే కొన్నిసార్లు ప్రాథమిక వాహన బీమా పాలసీ వానల వల్ల జరిగిన నష్టానికి పూర్తి పరిహారం ఇవ్వకపోవచ్చు. కాబట్టి, కొన్ని అనుబంధ పాలసీలు ఈ వానాకాలంలో తీసుకోవటం మంచిది. అందులో కొన్ని..

  1. ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ కవర్‌: కారు నీటిలో మునిగినప్పుడు ఇంజిన్‌కు జరిగిన నష్టానికి ఈ అనుబంధ పాలసీ నష్టపరిహారాన్ని అందిస్తుంది.
  2. రిటర్న్ టు ఇన్వాయిస్‌: వాహనం పూర్తిగా వాడకుండా పాడైన సమయాల్లో కొత్త వాహనం కొనేందుకు వీలుగా ఈ రిటర్న్‌ టు ఇన్వాయిస్‌ అనుబంధ పాలసీ ఉపయోగపడుతుంది. కారు పూర్తి ధరను చెల్లించేలా ఈ పాలసీని తీసుకోవచ్చు.
  3. రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌: వాహనం రోడ్డు మధ్యలో మొరాయించినప్పుడు బీమా సంస్థను సంప్రదించి పత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఈ సమయాల్లో ఉపయోగపడేదే రోడ్‌సైడ్‌ అసిస్టెంట్‌ కవరేజ్​ పాలసీ.

ఇవే కాకుండా మరికొన్ని అనుబంధ పాలసీలను కూడా కంపెనీలు అందిస్తున్నాయి. వాటిని మీ అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.