ETV Bharat / business

UPI Money Sent To Wrong Recipient? What next? : పొరపాటున వేరే వ్యక్తికి డబ్బు పంపిస్తే.. ఏం చేయాలి?

How to Get Back UPI Money Mistakenly Transferred : UPI యాప్స్ ద్వారా.. మనం పంపించాలనుకున్న ఖాతాకు కాకుండా.. వేరే అకౌంట్​కు మనీ ట్రాన్స్​ఫర్ చేస్తే.. ఏం చేయాలి..? ఆ డబ్బును వెనక్కి తీసుకోవడం ఎలా.. మీకు తెలుసా??

UPI Money Sent To Wrong Recipient? What next?
How to Get Back UPI Money Mistakenly Transferred
author img

By

Published : Aug 20, 2023, 4:45 PM IST

UPI Wrong Payment What to do Next : దేశంలో కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. ప్రతి పనికీ యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. దీంతో.. చిన్న చిన్న దుకాణాలు మొదలు.. భారీస్థాయి వ్యాపారాల వరకూ UPI స్కానర్ వైపు వేలు చూపిస్తున్నాయి. అయితే.. ఒక్కోసారి పంపే వారి నుంచి డబ్బు చెల్లింపు జరిగిపోయినా.. రిసీవర్​కు అందదు. ఇలాంటి పరిస్థితుల్లో.. నిర్ణీత సమయం తర్వాత ఆ డబ్బు వెనక్కి రావడమో.. రిసీవర్​కు ట్రాన్స్​ఫర్ కావడమో జరుగుతుంది. ఇంతవరకూ ఓకే.. కానీ పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బు పంపిపితే పరిస్థితి ఏంటి..? ఆ డబ్బును తిరిగి వెనక్కి ఎలా తీసుకోవాలి? అన్నది మీకు తెలుసా? ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

కస్టమర్ కేర్​ను సంప్రదించాలి :

Call To Customer Care Number : Google Pay లేదా PhonePe యాప్ ఏదైనా సరే.. ఆ ప్లాట్‌ఫామ్​ యొక్క కస్టమర్ కేర్‌ కు వెంటనే ఫోన్ చేయాలి. ఏం జరిగింది? ఎంత డబ్బు పంపించారు? ఏ అకౌంట్​కు పంపారు? వంటి వివరాలతో ఓ ఫిర్యాదు చేయాలి. ఆర్​బీఐ రూల్స్ ప్రకారం.. మీరు డబ్బు పంపిన 3 రోజుల్లోగా ఈ పని చేయాలి.

How to Make UPI Payments Without Internet : ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు.. ఒకే ఒక సింపుల్ సెట్టింగ్​తో!

బ్యాంక్ లో ఫిర్యాదు చేయాలి :

Complaint To Your Bank : మీరు ఏ బ్యాంకు అకౌంట్​ నుంచైతే మనీ ట్రాన్స్​ఫర్​ చేశారో.. ఆ బ్యాంక్​ కు ఫిర్యాదు చేయాలి. ఇక్కడ కూడా అన్ని వివరాలతో కంప్లైంట్ చేయాలి. ఈ పని చెల్లింపు జరిగిన 48 గంటల్లోగానే చేసేయాలి.

టోల్ ఫ్రీ నంబర్​కు కాల్ చేయండి..

Call to This Toll Free Number : UPI (or) నెట్ బ్యాంకింగ్.. ఎందుతో తప్పు జరిగినా.. వెంటనే 18001201740 నంబర్​కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. ఆ తర్వాత మీ బ్యాంకు శాఖకు వెళ్లి, వారిని అడిగితే ఓ ఫామ్ ఇస్తారు. దాన్ని పూర్తి చేయాలి.

  • ఒకవేళ ఈ విషయంలో మీ బ్యాంకు మిమ్మల్ని పట్టించుకోకపోతే.. bankingombudsman.rbi.org.in వెబ్ సైట్ ద్వారా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబుడ్స్‌మన్‌కు కంప్లైంట్ చేయొచ్చు.
  • నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెబ్‌సైట్‌లో కూడా కంప్లైంట్ చేయవచ్చు.

డెబిట్ కార్డు లేకున్నా.. ఏటీఎం నుంచి క్యాష్​ విత్​డ్రా చేసుకోవడం ఎలా?

సేవ్ చేసుకోండి :

Save The Transactions Messages :

  • పొరపాటు లావాదేవికి సంబంధించిన మెసేజ్​ లను భద్రంగా ఉంచుకోవాలి. వాటిని సాక్ష్యాలుగా సమర్పించాల్సి ఉంటుంది.
  • ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా.. మీ డబ్బును తిరిగి పొందే ఛాన్స్ ఉంది.
  • "చికిత్స కన్నా.. నివారణ మేలు" అన్నట్టుగా.. పొరపాటు జరిగిన తర్వాత రికవరీ కష్టాలు పడేబదులు.. ముందుగానే మేల్కొంటే మంచిది.
  • ఎవరికైనా డబ్బు పంపిస్తున్నప్పుడు.. ఖాతా సరియైనదేనా? పంపిస్తున్న మొత్తంలో ఏదైనా తేడా ఉందా? వంటి వివరాలను ఒకటికి రెండు సార్లు చూసుకోవడం ఎంతో ముఖ్యం.
  • ఈ విధంగా జాగ్రత్తపడడం ద్వారా.. సురక్షితమైన చెల్లింపులు జరపవచ్చు.

డెబిట్ కార్డ్ లేకపోయినా UPI యాక్టివేషన్​.. ప్రాసెస్ ఇలా..

సూపర్​ ఫీచర్​తో పేటీఎం​.. ఇకపై పిన్​ లేకుండానే పేమెంట్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.