Upcoming Tata Cars In 2024 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. ఎప్పటికప్పుడు సూపర్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌తో సహా, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే కార్లను మార్కెట్లోకి తెస్తుంటుంది. అందులో భాగంగా 2024, 2025 సంవత్సరాల్లోనూ తమ సరికొత్త బ్రాండెడ్ కార్లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ట్రెండ్‌కు అనుగుణంగా..
వినియోగదారుల అభిరుచులు గణనీయంగా మారుతున్న నేపథ్యంలో టాటా మోటార్స్.. అన్ని కేటగిరీలవారిని ఆకట్టుకునేందుకు ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ ఎస్యూవీ నుంచి టర్బో ఛార్జ్డ్ హ్యాచ్బ్యాక్స్ వరకు అన్ని రకాల కార్లను తయారుచేస్తోంది. అందుకే వాటిపై ఓ లుక్కేద్దాం.
2024లో లాంఛ్ కానున్న టాటా కార్స్ ఇవే!
1. Tata Punch EV Features : టాటా కంపెనీ ఈ పంచ్ ఎలక్ట్రిక్ కారును 2024 జనవరిలో లాంఛ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ టాటా పంచ్ ఈవీ నేరుగా సిట్రోయెన్ ఈసీ3 కారుతో పోటీ పడనుంది. ఈ పంచ్ ఈవీ కారు గరిష్ఠంగా 500 కి.మీ రేంజ్ కలిగి ఉంటుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ కారులో లార్జ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360 కెమెరా ఫీచర్లు లాంటి మంచి ఫీచర్లను పొందుపరుస్తున్నారు. అంతేకాదు ఈ కారులో ఈవీ స్పెసిఫిక్ డిజైన్ ఛేంజెస్ కూడా చేసినట్లు సమాచారం.
Tata Punch EV Price : ఈ టాటా పంచ్ ఈవీ కారు ధర రూ.12 లక్షల రేంజ్లో ఉండవచ్చు.
2. Tata Crvv EV Features : టాటా కంపెనీ 2024 మార్చి నెలలో ఈ కర్వ్ ఎలక్ట్రిక్ కారును లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టాటా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును మంచి డిజైన్‌తో, ఫ్యూచరిస్టిక్ ఫీచర్స్‌తో తయారు చేసి.. ఆటో ఎక్స్పో-2023లో ప్రదర్శించింది. ఈ కారులోని ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌ను ఒకసారి ఫుల్ రీఛార్జ్ చేస్తే.. ఏకంగా 500 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. కనుక ఇది ఇండియన్ కస్టమర్లకు బెస్ట్ ఛాయిస్ అవుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Tata Crvv EV Price : ఈ టాటా కర్వ్ ఈవీ కారు రూ.20 లక్షల ప్రైస్ రేంజ్లో ఉండే అవకాశం ఉంది.
3. Tata Altroz Racer Features : టాటా కంపెనీ ఈ ఆల్ట్రోజ్ రేసర్ కారును 2024 మార్చిలో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మంచి స్పోర్టీ హ్యాచ్‌బ్యాక్ కారు కొనాలని అనుకునేవారికి టాటా ఆల్ట్రోజ్ రేసర్ మంచి ఆప్షన్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారులో 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అమరుస్తున్నారు. ఇది 120 bph పవర్, 170 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. అంతేకాదు ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అనుసంధానం కలిగి ఉంటుంది. ఈ కారులో కూడా రెగ్యులర్ ఆల్ట్రోజ్ కార్లలాగానే మంచి సన్‌రూఫ్, బ్లాక్డ్-అవుట్ బోనెట్ & రూఫ్ ఉంటాయి.
Tata Altroz Racer Price : ఈ టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారు ధర సుమారుగా రూ.10 లక్షలు ఉండవచ్చు.
4. Tata Crvv ICE Features : టాటా మోటార్స్ 2024 ఏప్రిల్‌లో ఈ కర్వ్ ఐసీఈ వేరియంట్‌ను లాంఛ్ చేసే అవకాశం ఉంది. టాటా కంపెనీ ఈ కారును 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో తీసుకురానుంది. ఈ మిడ్-సైజ్ ఎస్యూవీ కారు నేరుగా.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్లతో పోటీ పడనుంది. అందుకే టాటా కంపెనీ దీనిని మంచి సామర్థ్యంతో, సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేలా రూపొందిస్తోంది.
Tata Crvv ICE Price : ఈ టాటా కర్వ్ ఐసీఈ కారు ధర రూ.10.50 లక్షల వరకు ఉండవచ్చు.
5. Tata Harrier Petrol Features : ఈ టాటా హారియర్ పెట్రోల్ కారును 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. దీనిని కూడా 2024లోనే లాంఛ్ చేయనున్నారు. టాటా కంపెనీ ఈ కారులో 1.5 లీటర్ TGDI ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుపరిచింది. ఇది 168 bhp పవర్, 280 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. తక్కువ బడ్జెట్లో మంచి ఎస్యూవీ కొనాలని ఆశించేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పుకోవచ్చు.
2025లో లాంఛ్ కానున్న టాటా కార్స్ ఇవే!
6. Tata Avinya Feaures : టాటా మోటార్స్ కంపెనీ ఈ అవిన్య కారును 2025 జనవరిలో లాంఛ్ చేయడానికి సిద్ధం అవుతోంది.
Tata Avinya Price : ఈ టాటా అవిన్య కారు ధర రూ.30 లక్షల ప్రైస్ రేంజ్లో ఉండొవచ్చని అంచనా.
7. Tata Harrier EV Features : టాటా కంపెనీ ఈ హారియర్ ఈవీ కారును 2025 ఏప్రిల్‌లో లాంఛ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.
Tata Harrier EV Price : ఈ టాటా హారియర్ ఈవీ కారు ధర రూ.30 లక్షల ప్రైస్ రేంజ్లో ఉండవచ్చు.
8. Tata Sierra Features : ఈ టాటా సియెర్రా కారును 2025 డిసెంబర్లో లాంఛ్ చేసే అవకాశం ఉంది.
Tata Sierra Price : ఈ టాటా సియెర్రా కారు ధర సుమారుగా రూ.25 లక్షలు ఉండవచ్చని అంచనా.
Tata Car Lineup : టాటా మోటార్స్ కంపెనీ.. కైట్, అట్మోస్, H7X, ఆల్ట్రోజ్ ఈవీ, హెక్సా, ఈవిజన్ ఎలక్ట్రిక్ కార్లను కూడా లైన్లో పెట్టింది. ఇవన్నీ బహుశా 2026లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.
2024లో లాంఛ్ కానున్న టాప్-3 SUV కార్స్ ఇవే! ధర ఎంతంటే?
కాలేజ్ స్టూడెంట్స్ స్పెషల్ - రూ.2 లక్షల బడ్జెట్లోని టాప్-10 బైక్స్ ఇవే!