ETV Bharat / business

రూ.10లక్షల బడ్జెట్​తో కారు కొనాలా?.. కొద్దిరోజులు వెయిట్​ చేస్తే.. మార్కెట్​లోకి సూపర్​ వెహికల్స్​! - మారుతీ సుజుకీ స్విఫ్ట్

Upcoming Cars Under 10 Lakhs : భారతీయ మార్కెట్​లోకి త్వరలోనే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు రానున్నాయి. ప్రముఖ కంపెనీలు మారుతి, టయోటా, హోండా, హ్యుందాయ్ తమ కొత్త మోడళ్లను విడుదల చేయనున్నాయి. వాటిన్నంటి ధర రూ.10 లక్షలలోపే ఉండనుంది. మరి ఆ కార్ల సంగతేంటో చూద్దాం రండి.

upcoming cars under 10 lakhs
upcoming cars under 10 lakhs
author img

By

Published : May 24, 2023, 4:29 PM IST

Upcoming Cars In India : కొత్తగా కారు కొనాలనుకునే వారు.. బడ్జెట్​ ఫ్రెండ్లీ వెహికల్స్ కోసం చూస్తుంటారు. రూ.10 లక్షల్లోపు కారును కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. ఆ డిమాండ్​కు అనుగుణంగా కార్ల తయారీ కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేక ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. అయితే త్వరలో రూ. 10 లక్షల బడ్జెట్​తో మార్కెట్​లోకి రానున్న ఐదు కొత్త కార్ల గురించి తెలుసుకుందాం రండి.

మారుతీ సుజుకీ స్విఫ్ట్ & డిజైర్
Upcoming Cars Under 10 Lakhs : భారతీయ మార్కెట్​లో రూ.10 లక్షల బడ్జెట్​లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో మారుతీ స్విఫ్ట్​, డిజైర్​ ముందు వరుసలో ఉంటాయి. ఇప్పుడీ ఈ రెండు మోడళ్ల కొత్త జనరేషన్ల కార్లను 2024లో మారుతీ తీసుకురానుంది. డిజైన్ల మార్పుతో పాటు అనేక కొత్త ఫీచర్లను కూడా జోడించనుంది.

Maruthi Swift Dzire : రెండు మోడళ్ల ఇంజిన్​లో స్పల్ప మార్పులు ఉంటాయని మార్కెట్​ విశ్లేషకులు భావిస్తున్నారు. 1.2 లీటర్​ హైబ్రిడ్​ పెట్రోల్​ ఇంజిన్​ కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పెట్రోల్​, సీఎన్​జీ.. రెండు ఆప్షన్లు ఉంటాయని అంటున్నారు. ధర కాస్త పెరుగుతుందని.. కానీ రూ.10 లక్షలోపే ఉండే అవకాశం ఉందమని చెబుతున్నారు.

హోండా అమేజ్
Honda Amaze New Model : ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ హోండా.. ఈ ఏడాది ద్వితీయార్థంలో అమేజ్​ మోడల్​ మూడో జనరేషన్​ను మార్కెట్​లోకి ప్రవేశపెట్టనుంది. అనేక కొత్త ఫీచర్లను జోడించనుంది. గత మోడల్ కన్నా ఈ కారు కాస్త పొడవు తక్కువగా ఉండనుంది. 1.2 లీటర్​ i-VTEC ఇంజిన్​తో ఈ కొత్త మోడల్​ రానుంది. 2024 ప్రమాణాలకు తగ్గట్లు క్యాబిన్​లో పలు మార్పులు చేయనుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్
Hyundai Exter Model : కొరియన్ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్.. ఈ ఏడాది జులై 10న ఎక్స్​టెర్​ ఎస్​యూవీని మార్కెట్​లో ప్రవేశపెట్టనుంది. ఆ కారుకు సంబంధించిన బుకింగ్స్​ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జులై నెలలో ఉత్పత్తి కూడా ప్రారంభం కానుంది. హ్యుందాయ్​ మరో మోడల్​ గ్రాండ్ ఐ10 నియోస్​ మాదిరిగానే అనేక ఫీచర్లు ఉండనున్నాయి. కొత్త మోడల్​లో పెట్రోల్​, సీఎన్​జీ ఆప్షన్లతో 1.2 లీటర్​ Kappa ఇంజిన్​ ఉండనుంది. ఎక్స్‌టర్ ఎక్స్​ షోరూమ్​ ధర దాదాపు రూ. 6 లక్షలు ఉండొచ్చని అంచనా.

upcoming cars under 10 lakhs
హ్యుందాయ్ ఎక్స్‌టర్

మారుతీ సుజుకీ కూపే SUV
Maruti Suzuki Coupe SUV : మారుతీ సుజుకీ- టయోటా.. భారత దేశంలో ఫ్రాంక్స్ తరహా కూపే ఎస్‌యూవీని పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాదిలో Taisor అనే పేరుతో మార్కెట్​లోకి విడుదల చేయనుంది. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న ఫ్రాంక్స్​ మోడల్​ మాదిరిగానే అనేక ఫీచర్లు ఉంటాయని, కానీ డిజైన్​ మారే అవకాశం ఉందని మార్కెట్​ విశ్లేషకులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.