Upcoming Bikes In India 2023 : భారత్‌లో టాప్ బ్రాండ్ బైక్స్‌కు యువతలో మంచి క్రేజ్ ఉంది. దీనిని క్యాష్ చేసుకుంటూ బ్రాండెడ్ టూ-వీలర్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి తెస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా ఈ ఏడాది కూడా రాయల్ ఎన్ఫీల్డ్, టీవీఎస్, హోండా, హోరో మోటోకార్ప్ లాంటి టాప్ కంపెనీలు.. సరికొత్త మోడల్స్‌ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350
New Gen Royal Enfield Bullet 350 : యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న టూ-వీలర్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్. ప్రస్తుతం ఈ కంపెనీ ఆగస్టు నెలాఖరు నాటికి బుల్లెట్ 350ని భారత్ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. దీనిలో 349 సీసీ సింగిల్ సిలెండర్ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇది 20బీహెచ్పీ పవర్, 27 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ సూపర్ బైక్‌లో 5 స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఉంది. ఈ బుల్లెట్ 350 బైక్.. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి చెందిన హంటర్ 350, క్లాసిక్ 350 లైన్అప్లో ఉంది.
![Royal Enfield Bullet 350](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-07-2023/19144194_royal_enfield_classic_350.jpg)
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450
Royal Enfield Himalayan 450 : బైక్ ప్రియులందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న హిమాలయన్ 450 బైక్‌ను పండగ సీజన్లో లాంఛ్ చేసేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ సన్నాహాలు చేస్తోంది. ఈ బైక్‌లో 450 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను పొందుపరుస్తున్నారు. ఇది 40 బీహెచ్పీ పవర్, 45 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుందని తెలుస్తోంది.
![Royal Enfield Himalayan 450](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-07-2023/19144194_-royalenfield-1.jpg)
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310
TVS Apache RTR 310 : టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ నేకెడ్ స్పోర్ట్స్ వెర్షన్ బైక్‌ను 'అపాచీ ఆర్టీఎక్స్' ట్రేడ్‌మార్క్‌తో భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ బైక్‌లో 312సీసీ ఇంజిన్ ఉంది. ఇది 34బీహెచ్పీ పవర్, 27.3 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇటీవల ఈ బైక్ రియర్ సెక్షన్ లీక్ అయ్యింది. ఇది ఆర్ఆర్ 310 బైక్ కంటే చాలా భిన్నంగా ఉండడం విశేషం. పండగ సీజన్లో దీనిని లాంఛ్ చేసేందుకు టీవీఎస్ మోటార్స్ కంపెనీ సిద్ధమవుతోంది.
![TVS Apache RTR 310](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-07-2023/19144194_red-bike.jpg)
హోండా సీబీ350 క్రూయిజర్
Honda CB350 Cruiser : హోండా కంపెనీ సీబీ350 ప్లాట్‌ఫాం ఆధారంగా సరికొత్త క్రూయిజర్ మోటర్‌సైకిల్ తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ జపాన్ కంపెనీ ఈ టూ-వీలర్ ద్వారా తన 350 సీసీ పోర్టుఫోలియోను భారత్‌లో మరింత విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రధానంగా రాయల్ ఎన్ఫీల్డ్ మెటోర్ 350కి పోటీగా.. హోండా సీబీ350 క్రూయిజర్‌ను తీసుకొస్తోంది.
హోండా సీబీ350 క్రూయిజర్ బైక్‌లో 348సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 21బీహెచ్పీ పవర్, 30ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 2023 చివరి నాటికి దీనిని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.
![Honda CB350 Cruiser](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-07-2023/19144194_honda-cb350-cruiser.jpeg)
రాయల్ ఎన్ఫీల్డ్ బాబర్ 350
Royal Enfield Bobber 350 : క్లాసిక్ 350 ఆధారంగా రూపొందించిన బాబర్ 350 డిజైన్ చాలా యూనిక్‌గా ఉంది. ఇటీవల లీక్ అయిన దృశ్యాలు దీనిని ధ్రువీకరిస్తున్నాయి. దీనిలో సరికొత్త ఏప్ హ్యాంగర్ టైప్ హ్యాండిల్ బార్, రౌండ్ హెడ్‌ల్యాంప్, టియర్‌డ్రాప్ డిజైన్ ప్యూయల్ ట్యాంక్, డ్యూయెల్ స్ల్పిట్ ఫ్లోటింగ్ సీట్, నంబర్ ప్లేట్‌తో కూడిన టైర్ హగ్గర్ ఉన్నాయి.
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బాబర్ 350లో 349సీసీ జే-సిరీస్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఈ బైక్‌ను ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.
![Royal Enfield Bobber 350](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-07-2023/19144194_royal-enfield-bobber-350.jpg)
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్
Triumph Scrambler 400X : 2023 అక్టోబర్ నెలలో ఈ బైక్ లాంఛ్ కానుంది. దీనిలో లాంగర్ వీల్‌బేస్, హైయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్, లాంగర్ ట్రావెల్ సస్పెన్షన్ ఉన్నాయి. స్క్రాంబ్లర్ 900, 1200 బైక్‌ల డిజైన్‌ను పోలీ ఉన్న ఈ బైక్.. ధర విషయంలోనూ వాటికి పోటీగా నిలుస్తుందని అంచనా.
న్యూ జెన్ కేటీఎం 390 డ్యూక్
New-Gen KTM 390 Duke : మూడో తరం కేటీఎమ్ 390 డ్యూక్ 2024 మొదట్లో భారత్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనిలో 399సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 373సీసీ మోటార్ ఇంజిన్ కంటే ఎక్కువ పవర్, టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
![New Gen KTM 390 Duke](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-07-2023/19144194_new-gen-ktm-390-duke.jpg)
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 450 :
Royal Enfield Hunter 450 : ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్.. ఇంచుమించు హిమాలయన్ 450 లానే ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా ట్రయంఫ్ స్పీడ్ 400కి పోటీగా తీసుకొస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ధర దాదాపు రూ.2.4 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండే అవకాశం ఉంది. దీనిని 2024 ప్రథమార్ధంలో విడుదల చేసే అవకాశం ఉంది.
![Royal Enfield Hunter 450](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-07-2023/19144194_royal-enfield-hunter-450.jpg)
హీరో 440 సీసీ బైక్
Hero 440 cc Bike : హార్లీ-డేవిడ్సన్ భాగస్వామ్యంతో ఈ లేటెస్ట్ హీరో బ్రాండ్ మోటర్ సైకిల్ రానుంది. దీనిని 2024 మార్చిలో లాంఛ్ చేయడానికి హీరో మోటోకార్ప్ సన్నాహాలు చేస్తోంది. దీని పవర్ క్రూయిజర్‌ను యమహా ఎమ్టీ-01 ఇన్స్పిరేషన్తో రూపొందించారు. హీరో 440సీసీ బైక్‌లో 440సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 27బీహెచ్పీ పవర్, 38 ఎన్ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
![Hero 440 cc Bike](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-07-2023/19144194_hero-440-cc-bike.jpg)
ఇవీ చదవండి :
క్రెటా, సెల్టోస్‌కు గట్టి పోటీ.. త్వరలోనే హోండా ఎలివేట్, సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ రిలీజ్!
Scooters under 1 lakh : బెస్ట్ స్కూటీస్.. స్పెక్స్, ఫీచర్స్ అదుర్స్.. ధర రూ.లక్ష లోపే!