Central Government Udyogini Scheme for Women: చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ప్లాన్స్ ఉన్నప్పటికీ.. నిధుల్లేక ఇబ్బందులు పడుతున్న మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందించేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే.. "ఉద్యోగిని" పథకం (Udyogini Scheme). ఈ పథకం ద్వారా.. మహిళలు 3 లక్షల రూపాయల వరకు లోన్ పొందే అవకాశం ఉంది. ఈ డబ్బుతో.. ప్రభుత్వం సూచించిన 88 రకాల వ్యాపారాల్లో ఏదో ఒకటి ఎంచుకొని ఆర్థికంగా స్థిరపడొచ్చు. అంగ వైకల్యం ఉన్నవారు, వితంతువులకు రుణ పరిమితి లేదు. వారి అర్హతలు, పెట్టే వ్యాపారాన్ని బట్టి ఇంకా ఎక్కువ రుణం పొందవచ్చు.
What is The Aim of Udyogini Scheme: మహిళలు తమ కాళ్లపై తాము నిలదొక్కుకోవడంతోపాటు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రవేశపెట్టిన పథకమే ఉద్యోగిని. ఈ పథకాన్ని మొదట కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ.. తరువాత కేంద్ర ప్రభుత్వం దీన్ని వుమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(Women Development Corporation) పర్యవేక్షణలో దేశమంతటా అమలు చేస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబనకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇది వెనుకబడిన ప్రాంతాల మహిళలను వ్యవస్థాపకులుగా మారడానికి ప్రేరేపిస్తుంది. పేద, నిరక్షరాస్య నేపథ్యాల నుంచి వచ్చిన మహిళలు ఈ పథకం ద్వారా మద్దతు పొందుతారు. ఈ పథకం వారి వ్యాపారంలో మహిళలకు సహాయపడే నైపుణ్య శిక్షణను కూడా అందిస్తుంది. కాగా, ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 48 వేల మందికి పైగా మహిళలు లబ్ధి పొంది వ్యాపారంలో రాణిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Women Saving Scheme : మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్.. ఇకపై బ్యాంకుల్లోనూ లభ్యం!
Udyogini Scheme Interest Rates Details: ఈ పథకం కింద అంగ వైకల్యం ఉన్నవారు, వితంతువులు, దళిత మహిళలకు పూర్తిగా వడ్డీ లేని రుణం అందిస్తారు. మిగిలిన వర్గాలకు చెందిన మహిళలకు మాత్రం 10 శాతం నుంచి 12 శాతం వడ్డీ మీద లోన్ ఇస్తారు. ఈ వడ్డీ బ్యాంకును బట్టి మారుతుంది. అలాగే.. కుటుంబ వార్షిక ఆదాయాన్ని బట్టి 30 శాతం వరకూ సబ్సిడీ అందిస్తారు.
ఉద్యోగిని పథకానికి ఎవరు అర్హులంటే..?
Udyogini Scheme Eligibility Criteria:
- 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయసు లోపు ఉన్న మహిళలు అందరూ అర్హులే.
- దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా ₹1,50,000 మించకూడదు.
- దరఖాస్తుదారుకి అవసరమైన లోన్ మొత్తం ₹3,00,000 మించకూడదు.
- ఉద్యోగిని రుణంపై ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు.
- వైకల్యం ఉన్న వారు లేదా వితంతువులకు వార్షిక కుటుంబ ఆదాయం, వయోపరిమితి లేదు.
- ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే స్త్రీలు తమ క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ బాగా ఉండేలా చూసుకోవాలి.
- గతంలో ఏదైనా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా ఉన్నట్లయితే లోన్ ఇవ్వరు.
ఉద్యోగిని పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లు..?
What are the Documents Required for Udyogini Scheme:
- పూర్తి చేసిన దరఖాస్తుతోపాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు జత చేయాలి
- దరఖాస్తు చేస్తున్న మహిళ ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్
- దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు రేషన్ కార్డు కాపీని జతపరచాలి.
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- బ్యాంకు ఖాతా పాసు పుస్తకం
ఉద్యోగిని పథకం కింద రుణం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
How to Apply for a Loan Under the Udyogini Scheme?
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో సమీపంలోని బ్యాంకుకు వెళ్లి.. దరఖాస్తు ఫారమ్ తీసుకోండి.
- అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి అప్లికేషన్‌ను పూర్తిగా పూరించండి.
- ఫారమ్‌లో పేర్కొన్న అన్ని డాక్యుమెంట్‌ల ఫొటోకాపీని అటాచ్ చేయండి.
- అనంతరం ఫిల్ చేసి ఫారమ్‌ను బ్యాంకుకు సమర్పించండి.
- దరఖాస్తు చేసిన తర్వాత, మీరు లోన్ ఆమోదం కోసం క్రమం తప్పకుండా బ్యాంకును సందర్శించాలి.