ETV Bharat / business

ఇండియాలోని డిఫరెంట్​ క్రెడిట్ కార్డ్స్​ - ఫీచర్స్​ & బెనిఫిట్స్​! - CashBack Credit Card benefits

Types Of Credit Cards In India In Telugu : మీరు కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకుందామని అనుకుంటున్నారా? ఎలాంటి కార్డు తీసుకోవాలో తెలియడం లేదా? అయితే ఇది మీ కోసమే. ఈ ఆర్టికల్​లో దేశంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల క్రెడిట్​ కార్డుల గురించి, వాటి ఫీచర్లు, బెనిఫిట్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

how many credit cards are there in India
Types Of Credit Cards In India
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 6:52 PM IST

Types Of Credit Cards In India : బ్యాంకులు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల క్రెడిట్ కార్డులను డిజైన్ చేస్తుంటాయి. వాటిలో మన అవసరాలకు తగిన కార్డును ఎంచుకోవాలి. అప్పుడే మన అవసరాలు తీరుతాయి. అదనపు బెనిఫిట్స్​ కూడా లభిస్తాయి. ప్రస్తుతానికి వినియోగదారుల సౌలభ్యం కోసం ఇండియన్​ బ్యాంకులు 8 రకాల క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. వాటి గురించి, వాటి ఫీచర్స్, బెనిఫిట్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. సాధారణ క్రెడిట్ కార్డులు
Regular Credit Card Benefits : మనలో చాలా మంది సాధారణ క్రెడిట్ కార్డులనే ఉపయోగిస్తారు. ఈ కార్డుకు అనుబంధంగా కుటుంబ సభ్యుల కోసం 3 యాడ్-ఆన్ కార్డులు కూడా తీసుకోవచ్చు. సాధారణ అవసరాలతోపాటు ఇంధన సర్​ఛార్జ్​ మినహాయింపులు, క్యాష్​బ్యాక్​లు, రివార్డు పాయింట్లు లాంటి అదనపు బెనిఫిట్స్​ ఈ కార్డుల ద్వారా పొందవచ్చు.

2. సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డు
Super Premium Credit Card Benefits : సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డులతో ఫ్యాన్సీ లాంజ్ యాక్సెస్​, ఫ్రీ గోల్ఫ్ గేమ్స్​, రివార్డ్స్ పాయింట్స్ సహా​, రెస్టారెంట్లలో చేసే ఖర్చులపై మంచి డిస్కౌంట్స్ లభిస్తాయి. ఇవే కాకుండా చాలా అదనపు ప్రయోజనాలను కూడా కల్పిస్తాయి. ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం అయినప్పుడు సూపర్ ప్రీమియం కార్డు బాగా ఉపయోగపడుతుంది.

3. కో బ్రాండెడ్ కార్డులు
Co Branded Card Benefits : క్రో బ్రాండెడ్ కార్డులు కొన్ని రకాల ప్రత్యేక సేవలను అందిస్తాయి. ఉదాహరణకు విమాన ప్రయాణాలకు సంబంధించిన బ్రాండెడ్ కార్డు తీసుకుంటే.. మనం చేసే ప్రయాణాలపై అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. విమాన టికెట్​ ధరల తగ్గింపు, ప్రత్యేక చెక్ ఇన్ కౌంటర్లు, అదనపు లగేజీ ఛార్జీలు తగ్గింపు, ఫ్రీ లాంజ్​ యాక్సెస్​ లభిస్తాయి. అంతేకాదు మీరు ఫ్రీ ఎయిర్​మైల్స్ సంపాదించి, వాటితో ఉచితంగా విమానం టికెట్లను కూడా పొందవచ్చు.

4. కమర్షియల్ క్రెడిట్ కార్డులు
Commercial Or Business Card Benefits : కమర్షియల్ క్రెడిట్ కార్డులు వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడతాయి. బిజినెస్ ట్రిప్స్​, పర్చేజెస్​ అన్నింటిపై బెనిఫిట్స్​ పొందవచ్చు. అంతేకాకుండా ప్రణాళిక ప్రకారం మన ఖర్చులను, ఇతర వ్యయాలను తెలుసుకోవచ్చు. ఎప్పుడు ఎక్కడ ఎంత ఖర్చు చేసింది. ఏ వస్తువుపై ఎంత ఖర్చయిందీ ఈ కార్డు ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. బ్యాంకులు పెద్ద కంపెనీల కోసం కార్డొరేట్ కార్డులు 24/7 సేవలు అందిస్తున్నాయి.

5. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు
Secured Credit Card Benefits : మీరు మంచి ఆదాయం లేదా క్రెడిట్ స్కోర్ కోసం, సాధారణ అవసరాల కోసం ఈ సెక్యూర్డ్​ క్రెడిట్ కార్డును ఉపయోగించవచ్చు. ఈ కార్డు జారీ చేసే ముందు బ్యాంకులు, మీరు తీసుకునే డబ్బు సకాలంలో తిరిగి చెల్లించాలనే గ్యారెంటీని తీసుకుంటాయి. అయితే ఈ కార్డు తీసుకోడానికి మీ ఆదాయం చూపాల్సిన అవరసరం ఉండదు.

6. ప్రీమియం క్రెడిట్ కార్డులు
Premium Credit Card Benefits : మీరు ఎక్కువ అదాయం సంపాదిస్తున్నా.. కొన్ని రకాల ఖర్చులకు డబ్బు సరిపోవడం లేదంటే ప్రీమియం క్రెడిట్​ కార్డు తీసుకోవడం ద్వారా మీ సమస్యను అధిగమించొచ్చు. ఈ ప్రత్యేక కార్డు ద్వారా ఎక్కువ రుణ మొత్తం, మెరుగైన రివార్డు పాయింట్లు పొందవచ్చు. దీని ద్వారా ఫ్యాన్సీ ఎయిర్​పోర్ట్ లాంజ్​ల్లో ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.

7. క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులు
Cash Back Credit Card Benefits : మనీబ్యాక్ లేదా క్యాష్​బ్యాక్ కార్డులు రోజువారి కొనుగోళ్లకు ఉపయోగించవచ్చు. ఈ కార్డుల ద్వారా మంచి క్యాష్​బ్యాక్స్, రివార్డ్ పాయింట్స్​ లభిస్తాయి. అంతేకాకుండా రెస్టారెంట్లు, షాపింగ్ బిల్లులపై మంచి డిస్కౌంట్స్ కూడా లభిస్తాయి.

8. ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డులు
Prepaid Credit Card Benefits : ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డు అనేది ఒక ప్రత్యేకమైన క్రెడిట్ కార్డు. దీనిని మీ కుటుంబ సభ్యులకు ఇచ్చి, వారి ఖర్చులను నియంత్రించవచ్చు. వాస్తవానికి చాలా కంపెనీలు, తమ ఉద్యోగుల రోజువారి ఖర్చులను కవర్ చేయడానికి ఈ కార్డులను అందిస్తూ ఉంటాయి.

రూ.5 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్​-8 మోడల్స్ ఇవే!

18 నుంచి గోల్డ్‌ బాండ్‌ సబ్‌స్క్రిప్షన్‌ - వారికి ప్రత్యేక డిస్కౌంట్ -​ ఎలా అప్లై చేయాలంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.