Top 10 YouTubers In India : యూట్యాబ్ ఒక సోషల్ మీడియా సంచలనం. అత్యంత సామాన్యులను న్యూ జనరేషన్ డిజిటల్ 'సెలబ్రిటీ'లుగా తీర్చిదిద్దిన గొప్ప వేదిక. వంటల నుంచి టెక్ న్యూస్ వరకు, కామెడీ స్కిట్ల నుంచి సాహస కృత్యాల వరకు అన్ని రకాల కంటెంట్ దీనిలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా నేటి కాలంలో యూట్యూబ్ అనేది ఒక గొప్ప ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాంగా పనిచేస్తోంది అంటే.. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంతో మంది యూట్యూబ్ వేదికగా విభిన్న అంశాలపై పాఠాలు చెబుతున్నారు. వీటిని ఫాలో అవుతూ మరెంతో మంది అత్యున్నత ఉద్యోగాలు సాధించారు.. సాధిస్తున్నారు. మరి ఈ వేదికను ఆసరా చేసుకుని గొప్ప సెలబ్రిటీలుగా మారిన టాప్-10 భారతీయ యూట్యూబర్ల గురించి మనమూ తెలుసుకుందామా?
యూట్యూబ్ చరిత్ర
History Of YouTube In India : యూట్యూబ్ 2008లో భారతదేశంలో ప్రారంభమైంది. ప్రారంభంలో కేవలం మ్యూజిక్ వీడియోలకు మాత్రమే ఇందులో ప్రాధాన్యం ఉండేది. కానీ తరువాత ఈ ప్లాట్‌ఫాం భారతీయ యువతీయువకుల నైపుణ్యాలను ప్రదర్శించే గొప్ప వేదిక అయ్యింది. ఇంటిలో వంట చేసే వీడియోల నుంచి.. ఫిల్మ్ మేకింగ్ వరకు అన్ని రకాల వీడియోలు ఇందులో అప్లోడ్ చేయడం ప్రారంభం అయ్యింది. ఇందులోని కంటెంట్ యూజర్ల అభిరుచికి అనుగుణంగా ఉండడంతో.. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను సంపాదించుకోగలిగింది యూట్యూబ్.
భారత్ నంబర్ 1
Indian YouTube Users Number : 2023లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ సంఖ్యను తీసుకుంటే.. భారత్‌లోనే అత్యధికంగా 467 మిలియన్లు ఉన్నారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కచ్చితంగా ఉంది. ఇంటర్నెట్ వాడకం రోజురోజుకూ పెరుగుతున్న నేటి కాలంలో కంటెంట్ క్రియేటర్లకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయనే చెప్పవచ్చు.
టాప్ -10 ఇండియన్ యూట్యూబర్స్
Indian Youtuber Top 10 List : భారతదేశంలో యూట్యూబ్ స్టార్స్ చాలా మందే ఉన్నారు. అందులో టాప్-10 యూట్యూబ్ సెలబ్రిటీలకు ఉన్న క్రేజే వేరు. వాళ్ల కంటెంట్‌కు, ఛానళ్లకు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. అందుకే కోట్లాది మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న ఆ టాప్-10 యూట్యూబ్ స్టార్స్ గురించి మనమూ తెలుసుకుందాం.
ర్యాంక్ | యూట్యూబర్/ ఛానల్ | ఛానల్ టైప్ | సబ్స్క్రైబర్స్ |
1 | CarryMinati | రోస్టింగ్, కామెడీ | 39.9 మిలియన్ |
2 | టోటల్ గేమింగ్ | గేమింగ్ | 35.7 మిలియన్ |
3 | Techno Gamerz | గేమింగ్ | 34.9 మిలియన్ |
4 | మిస్టర్ ఇండియన్ హ్యాకర్ | లైఫ్ హ్యాక్స్, ఎక్స్పెరిమెంట్స్ | 32.1 మిలియన్ |
5 | రౌండ్2హెల్ | కామెడీ స్కిట్స్ | 30.9 మిలియన్ |
6 | ఆశిష్ చెంచ్లానీ | కమెడీ స్కిట్స్, Vlogs | 29.8 మిలియన్ |
7 | సందీప్ మహేశ్వరి | మోటివేషనల్ స్పీకింగ్ | 27.9 మిలియన్ |
8 | BB Ki Vines | కామెడీ, ఎంటర్టైన్మెంట్ | 26.3 మిలియన్ |
9 | అమిత్ బాడాన | కామెడీ, ఎంటర్టైన్మెంట్ | 24.3 మిలియన్ |
10 | టెక్నికల్ గురూజీ | టెక్నాలజీ రివ్యూస్ | 23.1 మిలియన్ |
యూట్యూబ్ ఆల్గారిథమ్
Youtube Algorithm 2023 : యూట్యాబ్‌లో చాలా మంది మంచి కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. అయితే యూట్యూబ్ ఆల్గారిథమ్ను సరిగ్గా అర్థం చేసుకున్న వారే టాప్ యూట్యూబర్స్‌గా ఎదిగారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గారిథమ్ ప్రకారం, ఎస్ఈవో చేసినవారి కంటెంట్.. సెర్చ్ రిజల్ట్స్‌లో మొదటిగా కనిపిస్తుంది. అలాగే యూట్యూబ్ కూడా టాప్ యూట్యూబర్స్ వీడియోలను.. వీక్షకులకు రికమండ్ చేస్తుంది. అలాగే యూట్యూబ్ ఫ్లాట్‌ఫాం హోంపేజ్‌లో కూడా వారి వీడియోలనే మొదటిగా చూపిస్తుంది. అందువల్ల ఈ యూట్యాబ్ స్టార్స్‌కు మరింత మంది ఫాలోవర్స్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి.
యూట్యూబ్‌లో సక్సెస్ సాధించాలని ఆశించే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. క్వాలిటీ కంటెంట్ మాత్రమే సరిపోదు.. దానిని ప్రజలందరికీ తెలిసేలా ఎస్ఈవో చేయడం కూడా చాలా ముఖ్యం. అలాగే ఎప్పటికప్పుడు తాజాగా.. తమ యూజర్ల అభిరుచికి అనుగుణంగా వీడియోలు చేస్తూ ఉండాలి. అప్పుడే మీరు కూడా మంచి సక్సెస్ఫుల్ యూట్యూబర్ అయ్యే అవకాశం ఉంటుంది.
మంచి భవిష్యత్ ఉంది!
Top Content Creators In India : ప్రస్తుతం డిజిటల్ ఇండియా దిశగా మన దేశం పరుగులు పెడుతోంది. ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగింది. VR, AR లాంటి సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి. యువత కూడా సోషల్ మీడియా మానియాలో బతికేస్తోంది. అందువల్ల భారతీయ కంటెంట్ క్రియేటర్స్‌కు మంచి భవిష్యత్ ఉందని చెప్పవచ్చు.
టాప్ -10 యూట్యూబ్ ఛానల్స్ - ఇమేజెస్ ఇప్పుడు చూద్దాం!