Time Limit for First UPI Transaction : ఇప్పుడు దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ హవా నడుస్తోంది. దీంతో.. సైబర్ నేరస్థులు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. నిత్యం వందలాది మంది ఈ కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నారు. బ్యాంకులు, కస్టమర్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు ఎంచుకొని లూటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
UPI ట్రాన్సాక్షన్స్ లిమిట్ - ఫోన్‌పే, జీపేలో అలా - పేటీఎంలో ఇలా!
ట్రాన్సాక్షన్ రద్దు చేసుకునే వెసులుబాటు: ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే మొదటి ట్రాన్సాక్షన్ కంప్లీట్ కావడానికి.. నిర్దిష్ట సమయం పట్టేలా చూడాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. అంటే.. ప్రస్తుతం ఎవరికైనా డబ్బు పంపించాలంటే.. UPI ద్వారా క్షణాల్లో పంపొచ్చు. తొలిసారిగా పంపుతున్న వారికి కూడా ఇదే పద్ధతి అమల్లో ఉంది. అయితే.. ఇకపై ఈ పద్ధతి మార్చాలని చూస్తున్నట్టు సమాచారం. మొదటిసారి పంపే డబ్బు.. అవతలి వ్యక్తికి చేరడానికి చాలా సమయం పట్టేలా చూడాలని భావిస్తోందట! దీనివల్ల.. పొరపాటు ట్రాన్సాక్షన్ జరిగినా.. ఏదైనా మోసం జరిగినా.. ఆ డబ్బును అవతలి వ్యక్తి ఖాతాకు చేరకుండా ఆపొచ్చన్నది ఉద్దేశంగా చెబుతున్నారు. ఇలాంటి ట్రాన్సాక్షన్‌ను రద్దు చేసుకునే వెసులుబాటు కూడా ఉండేలా చూడబోతున్నట్టు సమాచారం.
కాస్త ఆలస్యమైనా..
ఈ కొత్త విధానం వల్ల డిజిటల్ లావాదేవీ (Digital Payments)ల విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ.. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఈ చర్య తప్పదనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. ఇద్దరు వ్యక్తుల మధ్య ఫస్ట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ కావడానికి దాదాపు 4 గంటల సమయం ఉండాలని చూస్తున్నట్టు సమాచారం. అయితే.. చిన్న మొత్తాలకు కాకుండా.. రూ.2 వేలు దాటే చెల్లింపులకు మాత్రమే ఈ 4 గంటల నిబంధన వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది.
యూపీఐ యూజర్లకు అలర్ట్! ఇకపై ఆ ఐడీలు పనిచేయవు! కారణం ఏంటంటే ?
ఇప్పటికే అమల్లో కొన్ని రూల్స్..
ఇప్పటికే కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయి. కొత్తగా యూపీఐ అకౌంట్ తెరిచినప్పుడు తొలి 24 గంటల్లో కేవలం 5వేల రూపాయలు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. అలాగే.. నెఫ్ట్‌లో తొలి 24 గంటల్లో 50 వేల రూపాయలను మాత్రమే పంపగలం. ఈ క్రమంలో ప్రభుత్వ తాజా ఆలోచన ప్రకారం.. గత చరిత్రతో సంబంధం లేకుండా.. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే మొదటి లావాదేవీలన్నింటికీ.. (రూ.2,000 దాటితే మాత్రమే) నాలుగు గంటల వ్యవధి నిబంధనను వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. మరి, ఈ నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్నది చూడాలి.
ఆధార్ కార్డుతో యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు! ఇకపై ఏటీఎం కార్డు అవసరం లేదు!!