ETV Bharat / business

జీతం రాకపోతే EMIలు చెల్లించడం ఎలా..? పరిష్కార మార్గాలివే! - రుణ వాయిదాలు ఆలస్యం అయితే చేయవలసిన పనులు

తీసుకున్న రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నన్ని రోజులూ ఇబ్బందేమీ ఉండదు. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం మారాల్సి వచ్చినా, మానేసినా ఆదాయం ఆగి వాయిదాలు చెల్లించడం భారం కావచ్చు. ఇలాంటప్పుడు తాత్కాలికంగా బకాయి పేరుకుపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో రుణ గ్రహీతపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. దీని నుంచి బయటపడేందుకు ఏం చేయాలి?

If loan installments are delayed news
రుణం వాయిదాలు ఆలస్యమైతే చేయాల్సిన పనులు
author img

By

Published : Feb 4, 2023, 3:20 PM IST

వందల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయన్న వార్తల నేపథ్యంలో చాలామంది తమ అప్పుల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. గృహరుణం, వాహన రుణం, వ్యక్తిగత రుణం, కార్డు బిల్లులు ఇలా ఏదో ఒక రుణం లేని వారుండరు. దీంతో జీతం రాకపోతే ఈఎంఐలు ఎలా చెల్లించాలని ఆలోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురై వాయిదాలు చెల్లించనప్పుడు సాధారణంగా బ్యాంకులు ఆ రుణగ్రహీతపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది తెలుసుకోవాలి.

మొండి బాకీగా..
ఏదైనా రుణానికి వరుసగా మూడు నెలలపాటు వాయిదాలను చెల్లించకపోతే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆ బాకీని తాత్కాలిక మొండి బకాయిగా భావిస్తాయి. రుణగ్రహీతకు నోటీసులు పంపిస్తాయి. వాయిదాలు ఆలస్యమైనప్పుడు బ్యాంకులు వాయిదా మొత్తానికి 1 నుంచి 2 శాతం వరకూ అపరాధ రుసుమును విధిస్తాయి. 6 నెలల వరకూ ఈఎంఐలు చెల్లించకపోతే బ్యాంకులు దాన్ని పూర్తిస్థాయి మొండి బకాయి (ఎన్‌పీఏ)గా నిర్ణయిస్తాయి. రుణం ఎన్‌పీఏగా మారినప్పుడే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తాయి. ఇప్పుడు కొన్ని ఆర్థిక సంస్థలు తమ ఎన్‌పీఏలను థర్డ్‌పార్టీకి అప్పగిస్తున్నాయి.

క్రెడిట్‌ స్కోరుపై..
వాయిదాలను సరిగా చెల్లించకపోతే.. క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుంది. తరచూ ఈఎంఐలు జమ కాకపోతే క్రెడిట్‌ స్కోరు కనీస స్థాయికి పడిపోయే ఆస్కారమూ ఉంది. ప్రస్తుతం బ్యాంకులు తమ వడ్డీ రేట్లను రెపోకు అనుసంధానం చేశాయి. దీంతోపాటు రుణగ్రహీత క్రెడిట్‌ స్కోరు ఆధారంగా వడ్డీని నిర్ణయిస్తున్నాయి. తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉంటే.. వడ్డీ రేటు పెరిగే ఆస్కారం ఉంది. మేజర్‌ డిఫాల్ట్‌ సందర్భంలో బ్యాంకులు ఎన్‌పీఏగా చూపిస్తే.. రుణం తీసుకున్న వ్యక్తి విశ్వసనీయత దెబ్బతింటుంది.

పరిష్కారం ఏమిటి?
తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురై.. వాయిదాలను చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బీమా పాలసీలపై ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. పరిస్థితులు సర్దుకున్నాక ఈ బాకీలన్నీ వెంటనే తీర్చేయాలి. ఒకవేళ మీకు ఆర్థిక అనిశ్చితి అధికంగా ఉన్నట్లు అనిపిస్తే.. ముందుగా తక్కువ వడ్డీ వస్తున్న పెట్టుబడి పథకాలను వెనక్కి తీసుకోండి. తాత్కాలికంగా బంగారం హామీగా రుణం తీసుకోవచ్చు. లేదా మిత్రులు, బంధువుల దగ్గర చేబదులు తీసుకునే వెసులుబాటునూ పరిశీలించవచ్చు.

  • లోన్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల్లాంటివి కొన్నాళ్లపాటు ఈఎంఐ చెల్లించకపోతే ఆదుకుంటాయి. ఇలాంటివాటిని ఎంచుకోవచ్చు. తాత్కాలికంగా ఉద్యోగం పోయినప్పుడు, ఆదాయం కోల్పోయినప్పుడు ఈ పాలసీ ఆదుకుంటుంది.
  • కనీసం 6 నెలల ఈఎంఐకి సరిపోయే మొత్తాన్ని ఎప్పుడూ అత్యవసర నిధిగా అందుబాటులో ఉంచుకోవాలి. దీనివల్ల మీపై ఆర్థిక ఒత్తిడి పడదు. తక్కువ ఈఎంఐ ఉండేలా రుణ వ్యవధిని ఎంచుకోవడం, మీ స్తోమతకు అనుగుణంగానే రుణాన్ని తీసుకోవడం ఎప్పుడూ సురక్షితం.
  • ఆదాయానికి మించి అప్పులు చేయొద్దు. మీకు వచ్చే ఆదాయంలో 40 శాతానికి మించి రుణ వాయిదాలకు వెళ్లకూడదు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండున్నాయి.. రూ.30వేల ఆదాయాన్ని ఆర్జించే వ్యక్తి 40 శాతం మేరకు ఈఎంఐలు చెల్లిస్తే.. మిగతా రూ.18వేలతో కుటుంబాన్ని నెట్టుకురాగలడా? రూ. లక్ష వేతనం ఉన్న వ్యక్తి.. రూ.40వేలు వాయిదాలకు చెల్లించినా.. మిగిలిన డబ్బును ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. కాబట్టి, ఆదాయం, ఖర్చులు చూసుకొని, ఈఎంఐ ఎంత ఉంటే ఇబ్బంది లేదో విశ్లేషించుకోవాలి.

అప్పులు తొందరగా తీర్చాలంటే..
మీ ఖర్చులకు కళ్లెం పడాల్సిందే. మీ నెలవారీ బడ్జెట్‌ను సిద్ధం చేయండి. అందులో ఖర్చులకు ప్రాధాన్యతా క్రమాన్ని ఇవ్వండి. తప్పనిసరి చెల్లించాల్సిన బిల్లులు, ఫీజులు, అనవసరమైన ఖర్చులు వేర్వేరుగా రాయండి. ముందుగా అవసరమైన వ్యయాలకు డబ్బు కేటాయించండి. వృథా వ్యయాల జోలికి అస్సలు వెళ్లకండి. ఇలా ఆదా చేసిన డబ్బును రుణాల చెల్లింపు కోసం వినియోగించండి.
అధిక రుణాలు ఉన్నప్పుడు వాటికి ఈఎంఐ చెల్లించడం కష్టంతో కూడుకున్న పని. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి. రెండు మూడు ఈఎంఐలు ఉన్నప్పుడు మన ఆర్థిక శక్తి సన్నగిల్లుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, వ్యక్తిగత, వాహన, కార్డు రుణాలన్నింటినీ కలిపి ఒకే రుణంగా మార్చే ప్రయత్నం చేయొచ్చు. గృహరుణానికి టాపప్‌లోన్‌ తీసుకోవడంలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. రుణాన్ని చెల్లించేందుకు వ్యవధీ దొరుకుతుంది.
పరిస్థితులు చేజారిపోతున్నాయని భావించినప్పుడు.. బ్యాంకును సంప్రదించి, పరిష్కార మార్గం గురించి ఆలోచించాలి. రుణ పునర్‌వ్యవస్థీకరణ, మారటోరియంలాంటివి కొంత ఊరట కలిగించవచ్చు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.