ETV Bharat / business

Things To Check Before Buying Land : భూమి కొంటున్నారా?.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - Things To Check Before Buying Land

Things To Check Before Buying Land In Telugu : మీరు కొత్తగా భూమి లేదా ప్లాట్​ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. భూమి లేదా ప్లాట్​ కొనేముందు కచ్చితంగా కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. లేకుంటే భవిష్యత్​లో లేనిపోని చిక్కులు వస్తాయి. మరి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా?

Land Buying Guide
Land Buying Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 2:02 PM IST

Things To Check Before Buying Land : ఇండియాలో నేడు రియల్​ ఎస్టేట్ బిజినెస్​ మంచి ఊపు మీద ఉంది. అందుకే చాలా మంది పొలాలు, ప్లాట్​లు, ఫ్లాట్​లు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రియల్​ ఎస్టేట్​ పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి లాభాలు అందిస్తాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ రంగంలో రిస్క్​ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక మదుపరులు రియల్ ఎస్టేట్​​ పెట్టుబడుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రీసెర్చ్​ చేయాలి :

  • రియల్​ ఎస్టేట్ బిజినెస్​లో పెట్టుబడులు పెట్టే ముందు కచ్చితంగా.. మీరు కొనాలని అనుకుంటున్న ప్రోపర్టీపై రీసెర్చ్ చేయాలి. ముఖ్యంగా ఆ ప్రాంతంలోని మౌలిక సదుపాయాలు గురించి తెలుసుకోవాలి. అంటే వాటర్​ సప్లై, ఎలక్ట్రిసిటీ, మురికి కాలువలు, రవాణా సౌకర్యాలు ఉన్నాయా? లేదా? చెక్​ చేసుకోవాలి. అలాగే సమీప పట్టణాలతో కనెక్టివిటీ ఉందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి.
  • మరీ ముఖ్యంగా సదరు ప్రాంతంలో ఆర్థిక వృద్ధి, సోషల్ డెవలప్​మెంట్​ ఎలా ఉందో తెలుసుకోవాలి. విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అలాగే వ్యాపార అభివృద్ధికి, ఉద్యోగితకు అనుకూలంగా ఉందో? లేదో చెక్​ చేసుకోవాలి.
  • అన్నింటి కంటే ముఖ్యమైనది.. సదరు ప్రోపర్టీకి మార్కెట్​లో ఉన్న అసలు విలువ ఎంతో తెలుసుకోవాలి. దీని వల్ల రియల్​ వాల్యూకే ప్రోపర్టీని కొని, తరువాత కాలంలో మంచి లాభాలు గడించడానికి వీలవుతుంది.

ఆస్తి పత్రాలను వెరిఫై చేయాలి​..
Documents Checklist For Buying A Plot In 2023 : ఆస్తులను కొనుగోలు చేసేటప్పుడు టైటిల్​ డీడ్ ఎవరి పేరు మీద ఉందో కచ్చితంగా తెలుసుకోవాలి. చాలా సార్లు ఆస్తుల యాజమాన్యం విషయంలో వివాదాలు ఉంటాయి. లేదా బ్యాంకు రుణాలు ఉంటాయి. కనుక భవిష్యత్​లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. ఆస్తులకు సంబంధించిన అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయా? లేదా? అనేది ముందుగానే చెక్​ చేసుకోవడం మంచిది.

లోకల్ బాడీ అప్రూవల్​ ఉండాలి!

  • భారతదేశంలోని రియల్​ ఎస్టేట్ చట్టాల ప్రకారం, భూములకు లేదా ఆస్తులకు కచ్చితంగా లోకల్ అథారిటీస్ అప్రూవల్ ఉండాలి. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలు వివిధ అవసరాల కోసం.. భూమిని పలు కేటగిరీలుగా విభజించి ఉంటాయి. అందువల్ల ఆయా కేటగిరీ భూములు లేదా స్థలాలు కొనాలన్నా, వాటిలో నిర్మాణాలు చేపట్టాలన్నా లోకల్ అథారిటీస్​ అప్రూవల్ కచ్చితంగా ఉండాలి.
  • ముంబయి, దిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో జోనల్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందువల్ల ఆయా ప్రాంతాల్లో రెసిడెన్సియల్​, కమర్షియల్​ నిర్మాణాలు చేపట్టాలంటే కచ్చితంగా లోకల్ అథారిటీ అప్రూవల్ తీసుకోవాలి. లేకుంటే భవిష్యత్​లో న్యాయపరమైన చిక్కులు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • ప్రోపర్టీలను కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఎన్​కంబరెన్స్ సర్టిఫికేట్​ను తనిఖీ చేయాలి. ఎందుకంటే.. దీనిలో సదరు ఆస్తికి సంబంధించిన నిజమైన యాజమాని వివరాలు, బ్యాంకు రుణాలు సహా అన్ని వివరాలు ఉంటాయి.

లిక్విడిటీ తక్కువ!
Real Estate Liquidity Risk : రియల్ ఎస్టేట్​ పెట్టుబడులకు లిక్విడిటీ చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే భూములు, ప్లాట్​లు, ఫ్లాట్​లను సులువుగా అమ్మేసి, వెంటనే డబ్బులు చేసుకోలేము. దీనికి చాలా సమయం పడుతుంది. వాస్తవానికి రియల్​ ఎస్టేట్ పెట్టుబడులు దీర్ఘకాలంలోనే మంచి లాభాలను గడించిపెడతాయి. కనుక ఓపిక, సహనం బాగా ఉండాలి.

బ్రోకరేజీ తక్కువగా ఉండేలా చూసుకోవాలి!
Real Estate Brokerage In India : సాధారణంగా మధ్యవర్తులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు జరగవు. ఈ మధ్యవర్తులు చాలా పెద్ద మొత్తంలో బ్రోకరేజీ తీసుకుంటూ ఉంటారు. చాలా సార్లు ఈ మధ్యవర్తులు మోసాలకు కూడా పాల్పడుతూ ఉంటారు. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేశంలోని బ్రోకర్లు ఇంచుమించు 1% నుంచి 5% వరకు బ్రోకరేజీ తీసుకుంటున్నారు. కొన్ని సార్లు ఇంతకు మించి బ్రోకరేజీ తీసుకున్న సందర్భాలూ ఉంటాయి. కనుక మధ్యవర్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే బాగా అనుభవం ఉన్న, రెప్యుటేషన్​ ఉన్న బ్రోకర్​లను ఎంచుకోవాలి.

భవిష్యత్ కలలు!
భారతదేశంలో చాలా మంది భూమిని బిజినెస్​గా కాకుండా.. తరతరాల వారసత్వ సంపదగా చూసుకుంటూ ఉంటారు. అందుకే వ్యాపారం కోసం కాకుండా.. తమకంటూ ఒక సొంత పొలం, భూమి, ఆస్తి ఉండాలని ఆశిస్తూ ఉంటారు. మీరు కూడా ఇలానే ఆలోచిస్తూ ఉంటే.. భూమి లేదా ప్లాట్​ కొనేముందు పైన తెలిపిన అన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే మీ భవిష్యత్​ కలలు సాకారమవుతాయి.

Apple India Festive sale : అదిరిపోయే డీల్స్​తో.. యాపిల్ ఫెస్టివల్​ సేల్​.. ఐఫోన్​, మ్యాక్​బుక్స్​పై భారీ డిస్కౌంట్స్​!

How To Get Business Loan : బిజినెస్​ లోన్ కావాలా?.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.