ETV Bharat / business

టర్మ్‌ పాలసీ క్లెయిం రిజెక్ట్ కాకూడదంటే ఈ జాగ్రత్తలు మస్ట్! - టర్మ్ ఇన్సూరెన్స్ జాగ్రత్తలు

Term Insurance Precautions : బీమా పాలసీలు కొనుగోలు చేసేటప్పుడు కొందరు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. దీంతో వాటిని క్లెయిం చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి పాలసీల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.

term-insurance-precautions-and-if-insurance-company-rejected-claim-what-to-do
టర్మ్‌ పాలసీ క్లెయిం తిరస్కణకు గురికాకుండా ఏం చేయాలి
author img

By

Published : May 9, 2023, 10:36 AM IST

Term Insurance Precautions : ఆర్థిక ప్రణాళికలో జీవిత బీమా తప్పనిసరి అవసరం. అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు ఈ పాలసీలు కుటుంబానికి ఆర్థిక రక్షణగా నిలుస్తాయి. పాలసీ కొన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్ల వల్ల.. క్లెయిం తిరస్కరణకు గురికావచ్చు. ఇది నామినీలకు పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటివి ఎదురు కాకుండా పాలసీదారుడు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో చూద్దాం..

తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ పొందాలంటే టర్మ్‌ పాలసీలను ఎంపిక చేసుకోవాలి. తీవ్ర వ్యాధులను దాచి పెట్టి పాలసీలను తీసుకోవడం వంటివి చేస్తే.. బీమా సంస్థలు ఏ మాత్రం సహించవు. క్లెయింను నిర్మొహమాటంగా తిరస్కరిస్తాయి. పాలసీలు కొనేటప్పుడు.. ఒక వ్యక్తి తన ఆదాయ వివరాలు, ఆరోగ్య స్థితి, వైద్య చరిత్ర, జీవన శైలికి సంబంధించిన అలవాట్లు.. ఇలా మొత్తం సమాచారం నిజాయితీగా బీమా సంస్థలకు అందించాలి. తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్లు సదరు సంస్థ గుర్తిస్తే.. క్లెయిం సందర్భంలో బీమా సంస్థ దాన్ని తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.

  • బీమా పాలసీదారుడు పూర్తి పారదర్శకంగా ఉండాలి. దాంతో పాటు బీమా సంస్థ అందిస్తున్న పాలసీపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలి. బీమా సంస్థ అడిగిన సమాచారాన్ని వారికి తెలియజేయాలి. సాధ్యమైనంత వరకు అవన్నీ నిజాలు, సరైనవే అయి ఉండాలి. బీమా పాలసీలో పేర్కొన్న అంశాలకు సంబంధించిన ఆధారాలు.. మీ దగ్గర ఉండేలా చూసుకోవాలి.
  • బీమా ప్రీమియాన్ని సరైన టైంలో చెల్లించాలి. కొన్నిసార్లు బీమా ప్రీమియం చెల్లించకపోవడం వల్ల.. క్లెయిం చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి పాలసీ ఎప్పుడూ అమల్లో ఉండేలా జాగ్రత్త వహించాలి.
  • బీమా సంస్థను ఎంచుకునే సమయంలో కొన్ని అంశాలను నిశితంగా పరిశీలించాలి. క్లెయింలను ఎక్కువగా పరిష్కరిస్తున్న కంపెనీని ఎంచుకోవడం మంచిది. ఐఆర్‌డీఏఐ వెబ్‌సైట్‌ లేదా ఆయా సంస్థల క్లెయిం చెల్లింపుల నివేదికలను పరిశీలించడం ద్వారా.. కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఏం చేయాలి?
If Insurance Company Rejected Claim What to Do : నామినీ దాఖలు చేసిన క్లెయింను బీమా సంస్థ తిరస్కరిస్తే.. ఏం చేయాలంటే..

  • కస్టమర్​ సేవా కేంద్రాన్ని సంప్రదించి తిరస్కరణకు గల కారణాలు స్పష్టంగా తెలుసుకోవాలి. ఏజెంటు లేదా బీమా సలహాదారు సహాయం తీసుకోవడం మంచిది. పాలసీని తీసుకున్న శాఖాధికారులను కలవాలి.
  • ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదును అందించండి. బీమా సంస్థలో ఉన్న ఫిర్యాదుల పరిష్కార అధికారిని కలవండి. ఐఆర్‌డీఏఐ వద్ద ఫిర్యాదుల పరిష్కారం కోసం ఓ ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. బీమా భరోసా సిస్టమ్‌ కింద ఇక్కడ మీ సమస్యను నమోదు చేసుకోవచ్చు.
  • మీరు ఎంపిక చేసుకున్న పాలసీ రకం, బీమా వాల్యూతో సంబంధం లేకుండా.. దరఖాస్తును పూర్తి చేసేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. మీకు తెలిసిన సమాచారాన్ని వెల్లడించలేకపోతే.. నిబంధనల మేరకు పాలసీ క్లెయింను తిరస్కరించే హక్కు.. ఇన్సూ​రెన్స్​ కంపెనీలకు ఉంటుందని మర్చిపోవద్దు.
  • ఇవీ చదవండి:
  • ఉమ్మడి బ్యాంక్ ఖాతా వాడుతున్నారా? వివాదాలు వస్తే ఏం చేయాలి?
  • స్విగ్గీ, జొమాటోలకు ప్రభుత్వ యాప్ పోటీ.. తక్కువ ధరకే ఫుడ్ ఆర్డర్ చేస్కోండిలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.