టాటా కంపెనీ మరిన్ని కొత్త మోడళ్లతో కార్లతో వినియోగదారుల ముందుకు రానుంది. అందులో నెక్సాన్, హారియర్, సఫారి వంటి మోడళ్లు సైతం ఉన్నాయి. వీటిని కూడా సరికొత్తగా తయారు చేయనున్నారు. ఇందులో క్సాన్, హారియర్ సఫారి ఫేస్‌లిఫ్ట్‌లతో పాటు కర్వ్, అవిన్యా వంటి ఎలక్ట్రానిక్ కార్లు కూడా ఉన్నాయి. మొత్తం 10 ఎస్‌యూవీలు ఉండనున్నాయి. వచ్చే మూడేళ్లలో వీటిని విడుదల చేయనున్నారు.
1. టాటా అవిన్యా..
ఈ మోడల్ కారును 2026లో మార్కెట్లోకి తెచ్చేందుకు టాటా కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. ఇది జెన్-3 ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి పనిచేస్తుంది. దీన్ని పూర్తి ఆధునికంగా రూపొందించనున్నారు. దీని వెడల్పు, ఎల్ఈడీ లైట్ బార్, టీ లోగో, సూసైడ్ డోర్లు, తేలియాడే టెయిల్ లైట్ యూనిట్, పెద్ద గ్లాస్ రూఫ్, షార్ట్ ఓవర్‌హాంగ్‌లు, సస్స్టైనబుల్ మెటీరియల్‌లతో కూడిన విశాలమైన ఇంటీరియర్, డాష్‌లో ఇంటిగ్రేటెడ్ స్క్రీన్‌తో దీన్ని తయారు చేయనున్నారు.
2. టాటా హారియర్ ఈవీ..
ఈ వచ్చే సంవత్సరం భారత్‌లో లాంఛ్ చేసే అవకాశాల ఉన్నాయి. అద్భుతమైన స్టైలిష్ డిస్ప్లేతో ఈ కారు రానుంది. ఈ కారు డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటారు సెటప్‌ను కలిగి ఉంటుంది. టాటా కార్లలో జీరో-ఎమిషన్ ప్యాసింజర్ వెహికిల్‌గా ఇది నిలునుంది.
3. టాటా సియెర్రా ఈవీ..
ఇప్పుడున్న సియెర్రా ఈవీ కారుతో పోలిస్తే కొన్ని మార్పులతో దీన్ని విడుదల చేయనున్నారు. 170 పీఎస్ వేగంతో.. నెక్ట్స్ జెన్ 1.5 లీటర్ డీఐ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించిన మొదటి మోడల్‌గా ఇది నిలువవచ్చు.
4. టాటా సఫారి ఈవీ..
టాటా సఫారి కారులను కూడా ఎలక్ట్రానిక్ వెహికిల్ మార్చేందుకు టాటా ప్రయత్నాలు చేస్తోంది. ఇది వీలైనంతా తొందరగా మార్కెట్లోకి విడుదల కావచ్చు.
5. టాటా కర్వ్ ఈవీ..
ఇది ఎలక్ట్రిక్ వెర్షన్ కారు. దీని పొడవు నాలుగు మీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది జిప్ట్రాన్ సాంకేతికతతో పనిచేస్తుంది. ఏస్ కర్వ్ మోడల్ కారు వలే క్యాబిన్ లోపల, బయట భాగాలు రూపొందించబడ్డాయి.
6. టాటా టియాగో ఈవీ బ్లిట్జ్..
ఇది ఎలక్ట్రానిక్ కారు. ఇది 2024లో విడుదుల కానుంది. కొంచెం అప్డేట్ చేసిన అనంతరం ఈ కారును తీసుకురానున్నారు. రెగ్యులర్ మోడల్‌తో పోలిస్తే.. విజువల్ అప్డెట్, బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో దీని కొత్తగా తయారుచేశారు. బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ క్రితం మోడల్‌లానే ఉంటాయి.
7. టాటా ఆల్ట్రోజ్ రేసర్..
ఆల్ట్రోజ్ మోడల్‌తో పోలిస్తే.. కారు బయట కొన్ని మార్పులను చేయనున్నారు. రీట్యూన్డ్ సస్పెన్షన్, స్పోర్టియర్ ఎగ్జాస్ట్ నోట్ వంటి మెకానికల్ అప్‌డేట్‌లు ఈ కారులో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
8. టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్..
ఈ మోడల్ కారు 2024లో విడుదల కానుంది. ఇప్పటికే రోడ్లపై దీన్ని టెస్టింగ్ కూడా చేశారు. దీన్ని సరికొత్త మార్పులతో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
9. టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్..
టాటా హారియర్ గత కొన్నేళ్లుగా మార్కెట్లో ఉంది. కానీ దీనికి అమ్మకాలు అనుకున్నట్లుగా జరగడం లేదు. దీంతో హారియర్‌కు కొన్ని మార్పులు తీసుకువచ్చి సరికొత్తగా వినియోగదారుల ముందుకు తెస్తున్నారు.
10. టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్..
టాటా సఫారిని కూడా కొన్ని మార్పులతో తెచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఇది 2024లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ కారును పూర్తిగా మార్పులు చేయనున్నట్లు సమాచారం. కారు ముందు భాగంలో మార్పులు తెస్తోంది. కారు లోపల కూడా సరికొత్త ఫీచర్లను పరిచయం చేయనున్నారు.
11. టాటా కర్వ్ ఏస్..
నెక్సాన్ ప్లాట్‌ఫామ్‌కు చేసిన మర్పుల ఆధారంగా దీన్ని రూపొందించారు. 2024 ప్రారంభంలో ఈ కారును విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐసీ ఇంజన్‌తో ఈ కారును కొత్తగా తయారు చేశారు. ఈ కారు 1.2ఎల్ టర్బోచార్జ్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఫీటర్ కలిగి ఉన్న టాటా మొదటి మోడల్‌గా ఇది నిలుస్తోంది.
12. టాటా పంచ్ సీఎన్జీ..
2023 చివర్లో ఈ కారును లాంఛ్ చేస్తారు. 1.2లీటర్ పెట్రోల్ ఇంజిన్ సామర్థంతో దీన్ని రూపొందించారు. చాలా వేరియంట్లలో ఈ మోడల్‌ను అమ్మేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.
13. టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ..
ఇది కూడా ఈ సంవత్సరం చివర్లో అమ్మకాలకు సిద్ధంగా ఉంటుంది. ఇది ట్విన్ సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఒక్కొక్క దానికి 30 లీటర్ల సామర్థం ఉంటుంది.