ETV Bharat / business

అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​కు పోటీగా 'టాటా న్యూ'.. అదిరే ఫీచర్లు, రివార్డులు.. - tata digital

Tata Neu: గ్రాసరీస్ నుంచి గ్యాడ్జెట్ల వరకు... ఫుడ్​ ఆర్డర్ల నుంచి ప్రయాణ టికెట్ల వరకు వివిధ యాప్​లను వాడాల్సిన పనిలేకుండా ఒకే చోట ఆ సేవలను అందించేందుకు సిద్ధమైంది టాటా న్యూ. టాటా గ్రూప్​ తీసుకురానున్న ఈ సూపర్​ యాప్​.. ఏప్రిల్​ 7నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ యాప్​ విశేషాలను తెలుసుకోండి.

Tata Neu
tata new app
author img

By

Published : Apr 5, 2022, 6:52 PM IST

Tata Neu: అమెజాన్, జియోలకు పోటీగా.. టాటా గ్రూప్​ సూపర్​ యాప్​ 'టాటా న్యూ'.. ఏప్రిల్ 7న విడుదలకానుంది. ఈ మేరకు తన యాప్​లో, గూగుల్​ ప్లే స్టోర్​లో వెల్లడించింది టాటా. ప్రస్తుతం ఈ యాప్​ను తన ఉద్యోగులతో టెస్ట్ చేయిస్తోంది సంస్థ.

ఏమిటీ సూపర్​ యాప్? షాపింగ్​ అవసరాలు, ఫుడ్ ఆర్డర్లు, ప్రయాణ టికెట్లు, హోటల్ బుకింగ్స్​ కోసం మనం చాలా రకాల యాప్స్​ వాడుతుంటాం. అయితే వాటన్నింటినీ ఒకే దగ్గర పొందగలగడమే ఈ సూపర్​ యాప్ కాన్సెప్ట్​. దీని ద్వారా ఫోన్​లో స్టోరేజీ బాధ ఉండదు. అనేక యాప్​ల కోసం సైన్​అప్ అవ్వాల్సిన అవసరం లేదు.

Tata Neu
టాటా న్యూ

'టాటా న్యూ'లో ఏమేం చేయొచ్చు? టాటా గ్రూప్​లోని అనేక బ్రాండ్​లను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదే 'టాటా న్యూ'. ఫైనాన్స్​, మెడిసిన్, హాలిడే, ఎలక్ట్రానిక్స్​, గ్రాసరీస్​ సహా మరెన్నో విభాగాల్లో ఈ యాప్​ ద్వారా ఆఫర్లు పొందవచ్చు. బిగ్​బాస్కెట్, ఎయిర్​ ఏసియా, క్రోమా, టాటా క్లిక్, వెస్ట్​సైడ్​, ఐహెచ్​సీఎస్​ వంటి సంస్థల నుంచి ఆకర్షణీయ ఆఫర్లు ఉంటాయి.

రివార్డ్ పాయింట్లు కూడా..: టాటా న్యూ ద్వారా 'న్యూకాయిన్స్​' అనే రివార్డు పాయింట్లు కూడా అందుతాయి. ఆన్​లైన్​తో పాటు ఆఫ్​లైన్​ కొనుగోళ్లకూ పాయింట్లు వస్తాయి. వాటిని క్యాష్​బ్యాక్​గా, డిస్కౌంట్లుగా వాడుకోవచ్చు. ఈ రకంగా ఇది షాపింగ్​తో పాటు యూపీఐ పేమెంట్స్​ యాప్​గానూ పనిచేస్తుంది.

అమెజాన్, పేటీఎం, రిలయన్స్​ జియో వంటి సంస్థలు ఇదివరకే తమ సూపర్​ యాప్​లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాటి ద్వారా పేమెంట్లు, కంటెంట్ స్ట్రీమింగ్, షాపింగ్, ట్రావెల్ బుకింగ్స్​, గ్రాసరీస్ వంటి సేవలను అందిస్తున్నాయి. ముఖేశ్ అంబానీకి చెందిన జియా మార్ట్​ కూడా త్వరలోనే ఈ సూపర్​ యాప్​ వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది.

ఇదీ చూడండి: టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏయే మోడళ్లపై ఎంతంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.