ETV Bharat / business

మ్యూచువల్ ఫండ్​లలో నెలనెలా ఆదాయం రావాలంటే ఇలా చేయండి! - మ్యూచువల్​ ఫండ్​లలో నెలనెలా ఆదాయం

Systematic Withdrawal Plan Mutual Fund : మ్యూచువల్ ఫండ్​లలో క్రమానుగతంగా పెట్టుబడి పెట్టడమే సిప్. ఇందులో పెట్టుబడిని ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతినెలా ఆదాయం వచ్చే ఏర్పాటు కూడా చేసుకోవచ్చు. దీనికోసం సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌- ఎస్‌డబ్ల్యూపీని ఉపయోగించుకోవచ్చు. ఈ ఎస్​డబ్ల్యూపీ గురించి మరిన్ని వివరాలు మీకోసం.

Benefits Of SWP In Mutual Fund
Benefits Of SWP In Mutual Fund
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2023, 10:55 AM IST

Updated : Nov 12, 2023, 11:02 AM IST

Systematic Withdrawal Plan Mutual Fund : ప్రతి ఒక్కరికీ నిర్ణీత ఆర్థిక అవసరాలు, లక్ష్యాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా వారి పెట్టుబడి విధానం మారుతుంది. ఇలాంటి సమయాల్లో చాలా మంది మదుపరులు మ్యూచువల్​ ఫండ్​ల వైపు మొగ్గుచూపిస్తారు. మ్యూచువల్‌ ఫండ్​లలో మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం- ఎస్‌ఐపీ అందుబాటులో ఉంది. ఈ విధానం ద్వారా నెలకు నిర్ణీత మొత్తాన్ని మనం అనుకున్నంత కాలంపాటు పెట్టుబడి పెట్టవచ్చు. దీన్నే సిప్‌ అంటారు. ఈ మ్యూచువల్ ఫండ్​లలో దీర్ఘకాలంలో మంచి రాబడి ఆర్జించే అవకాశం ఉంటుంది. ఇందులో అనుకున్నంత కాలం మదుపు చేసిన తర్వాత.. ఆ డబ్బును ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. లేదా సిప్‌ చేసినట్లుగానే ఎస్‌డబ్ల్యూపీ విధానంలో నెలనెలా మన అవసరాలకు కోసం కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకునే వీలుంది.

ఇలా పనిచేస్తుంది!
Systematic Withdrawal Plan : మ్యూచువల్‌ ఫండ్​లలో మదుపు చేసిన డబ్బులను ఒకేసారి వెనక్కి తీసుకోకుండా.. క్రమానుగతంగా తీసుకోవడమే సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌- ఎస్‌డబ్ల్యూపీని. అయితే ఇందులో నెలకు ఎంత మొత్తం అవసరమో ముందే నిర్ణయించుకోవాలి. ఆ మేరకు ఫండ్‌ సంస్థ యూనిట్లను విక్రయించి.. డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది.

How SWP Plan Works : మనం పోగు చేసిన దాంట్లో కొంత మొత్తాన్ని నెలకే కాకుండా, మూడు, ఆరు నెలలు, సంవత్సారానికి ఒకసారి వచ్చే ఏర్పాటు కూడా చేసుకునే వీలుంది. నెలకు లేదా అనుకున్న కాలానికి నిర్ణీత సంఖ్యలో యూనిట్లను విక్రయించాల్సిందిగా మనం సూచించవచ్చు. అయితే ఇలాంటి సమయాల్లో వచ్చే మొత్తంలో కొంత హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక కచ్చితమైన మొత్తమే కావాలనుకుంటే.. ఆ మేరకు ఫండ్‌ సంస్థ యూనిట్లను విక్రయిస్తుంది.

ఉదాహరణకు మీకు నెల నెలారూ.5,000 కావాలని అనుకున్నారు. అప్పుడు యూనిట్‌ ధర రూ.100 ఉందనుకుంటే.. ఫండ్‌ సంస్థ 50 యూనిట్లను విక్రయించి, డబ్బును జమ చేస్తుంది. అదే మీరు నెలకు 50 యూనిట్లు విక్రయించాలని చెప్పారని అనుకుందాం. ఆ సయమంలో యూనిట్‌ ధర ఒక నెల రూ.100 ఉంటే రూ.5,000 వస్తాయి. ఇక యూనిట్​ ధర రూ.90 ఉంటే.. రూ.4,500 వస్తాయి. అలా యూనిట్​ ధర రూ.110 అయితే.. రూ.5,500 జమ అవుతాయి.

రిటైర్​ అయిన వారికి...
ముఖ్యంగా రిటైర్​ అయిన వారు.. పింఛను రూపంలో నెలనెలా కొంత మొత్తాన్ని అందుకోవాలని అనుకున్నప్పుడు ఈ ఎస్‌డబ్ల్యూపీ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. డెట్‌ ఫండ్​లు, ఈక్విటీ ఫండ్​లలోనూ మదుపు చేసి, ఎస్‌డబ్ల్యూపీని వాడుకోవచ్చు. నష్టభయాన్ని భరించే సామర్థ్యాన్ని బట్టి, ఏ తరహా ఫండ్​లను ఎంచుకోవాలన్న విషయంపై నిర్ణయం తీసుకోవాలి.
క్రమానుగతంగా మదుపు చేసిన పెట్టుబడిని ఒకేసారి వెనక్కి తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ఆశించిన మొత్తం రాకపోవచ్చు. దీనికి బదులుగా పెట్టుబడి ఎలా పెట్టామో.. అదే విధంగా నెలనెలా వెనక్కి తీసుకుంటే.. పెట్టుబడి కొనసాగుతూ ఉంటుంది. దీంతోపాటు సగటు ప్రయోజనం వల్ల అధిక రాబడులకు కూడా వీలు కలుగుతుంది.

హోమ్ ​లోన్ EMI సరిగా కట్టకపోతే ఏమవుతుంది? బ్యాంకులు ఏం చేస్తాయి?

ఉద్యోగులకు EPFO దీపావళి కానుక - అకౌంట్లోకి పీఎఫ్ వడ్డీ - చెక్​ చేసుకోండిలా!

Last Updated : Nov 12, 2023, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.